మన తెలంగాణ/వేల్పూరు : మాజీ మంత్రి, బాల్కొండ ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో గురువారం రాజకీయ రణరంగానికి వే దికగా నిలిచింది. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నా యకుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు మా నాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పార్టీ తరఫున వేల్పూర్ లో నిర్వహించ తలపెట్టిన కనువిప్పు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గల్ఫ్ బాధితులను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని, గల్ఫ్ బాధితుల గో డును పట్టించుకోవడం లేదంటూ వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వంపైనా, సిఎం రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ గురువారం వేల్పూర్‌లో కనువిప్పు కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టింది.
పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు ఏం చేసిందో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏం చేసిందో ప్రశాంత్ రెడ్డికి ప్రజల సమక్షంలోనే వివరించి ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కలిగిస్తామని మానాల మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వేల్పూర్‌లో కనువిప్పు కార్యక్రమం శాంతిభద్రతల సమస్యగా మారి పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు అవకాశం ఉండటంతో పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య ఆదేశాలతో వేల్పూర్ లో 163 బిఎన్‌ఎస్ యాక్ట్ అమలుకు ఆదేశించి కర్ఫ్యూ విధించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ ఆర్ ఐ సెల్ రాష్ట్ర కార్యదర్శి నంగి దేవెందర్ రెడ్డిని చితకబాదిన బిఆర్‌ఎస్ కార్యకర్తలు
కాంగ్రెస్ కనువిప్పు పిలుపుతో వేల్పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎంఎల్‌ఎ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి ఉన్నప్ప టికీ కాంగ్రెస్ పార్టీ ఎన్ ఆర్ ఐ సెల్ రాష్ట్ర కార్యదర్శి నంగి దేవెందర్ రెడ్డి బిఆర్‌ఎస్ కార్యకర్తల్లో కలిసిపోయి ఎంఎల్‌ఎ ఇంట్లోకి వెళ్లారు. ఎంఎల్‌ఎ కార్యకర్తలతో మాట్లాడుతుండగా నంగి దేవెందర్ రెడ్డి వారిలో కలిసి పోయి ఎంఎల్‌ఎ ఇంట్లో ఏం జరుగుతుందనే విషయాలను బయటనున్న కాంగ్రెస్ నాయకులకు తెలిసే విధంగా లైవ్ వీడియో ఆన్‌లో ఉంచినట్లు బిఆర్‌ఎస్ కార్యకర్తలు గుర్తించి దేవెందర్‌ను అక్కడే చితక బాదారు. ఇది గమనించిన ప్రశాంత్ రెడ్డి అతన్ని పోలీసులకు అప్పగించాలని చెప్పడంతో పోలీసులకు అప్పగించే ప్రయత్నంలో బయటనున్న కార్యకర్తలు దేవెందర్ రెడ్డిని వెంట పడి కొట్టారు. బిఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో నంగి దేవెందర్ రెడ్డి చొక్కా చిరిగిపోయింది. పోలీసులు ఆయనకు రక్షణగా ఉండి పోలీస్ వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.
పోలీసు వాహనానికి అడ్డుపడ్డ మహిళా కార్యకర్త
కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలిస్తుండగా ఓ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కార్యకర్త పోలీసు వాహనానికి అడ్డంగా వెళ్లి నిలబడింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న పార్టీ కార్యకర్తలను వదిలేయాలని డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా ఇష్యూ సెన్సిటివ్ గా మారింది. ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి మహిళా కార్యకర్తను పోలీసు వాహనానికి అడ్డు తప్పుకోవాలని సముదాయించినా వినకపోవడంతో బలవంతంగా ఆమెను పక్కకు తప్పించి వాహనాన్ని అక్కడి నుండి పంపించారు.
ప్రశాంతరెడ్డి, మానాలతో సహా ఇరు పార్టీ ముఖ్య నేతల గృహనిర్భందం
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కనువిప్పు పిలుపుతో అప్రమత్త మైన బాల్కొండ ఎంఎల్‌ఎ పశాంత్ రెడ్డి, తన తమ్ముడు అజయ్ రెడ్డి సహా బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పాటు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో వేల్పూర్‌లోని తన స్వగృహంలోనే ఉన్నారు. పోలీసులు కూడా ఎమ్మె ల్యే ఇంటి వద్ద మోహరించారు. కనువిప్పుకు పిలుపు నిచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని నిజామాబాద్ లోని తన ఇంట్లోనే గృహ నిర్భంధం చేశారు.