Monday, June 17, 2024

లవ్, ఎమోషన్, యాక్షన్, డ్రామాతో ‘భజే వాయు వేగం’.. ట్రైలర్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘భజే వాయు వేగం‘. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 31న ‘భజే వాయు వేగం‘ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ‘భజే వాయు వేగం‘ ట్రైలర్‌ను హైదరాబాద్ ఐమాక్స్‌లో ఘనంగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూవీ కాన్సెప్ట్ చైతన్య మాట్లాడుతూ మా భజే వాయువేగం సినిమా ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోందన్నారు.

డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ “భజే వాయు వేగం ఒక మంచి ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. ఒక సాధారణ మనిషి అసాధారణ సమస్యలో ఇరుక్కుంటే… అందులో నుంచి ఎలా బయటపడ్డాడు అనేది అన్ని ఎమోషన్స్ కలిపి ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో చూపిస్తున్నాం”అని తెలిపారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ “కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమా కథలో సహజంగా కుదిరాయి. కథలోని లవ్, ఎమోషన్, యాక్షన్, డ్రామా వంటివన్నీ డైరెక్ట్‌గా ప్రేక్షకుల మనసును తాకుతాయి. ఆర్‌ఎక్స్ 100 తర్వాత నాకు భజే వాయు వేగం మరో బెంచ్ మార్క్ మూవీ అవుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఐశ్వర్య మీనన్, డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News