మన తెలంగాణ/నిజామాబాద్ స్పోర్ట్: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈసందర్భంగా మానాల మాట్లాడుతూ హరీష్‌రావు, కెటిఆర్ అధికారం పోయిన నుండి అబద్దపు మాటలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం పోగానే మతి స్థితమితం కోల్పోయి పిచ్చి పట్టినట్లు మాట్లాడున్నారని ఆయన అన్నారు. ఈరోజు మేము వేల్పూర్ గ్రామంలో కను విప్పు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కను విప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని మానాల తెలిపారు.
గతంలో ఎన్నోసార్లు పత్రికముఖంగా ప్రశాంత్‌రెడ్డికి గత పది సంవత్సరాలలో టిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాలు చేసిన అవినీతి గురించి పైన అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిపైన చర్చకు రావాలని పలుమార్లు విజ్ఞప్తి చేసిన ప్రశాంత్ రెడ్డి రాకపోవడంతో ప్రెస్‌క్లబ్ నందు కూడా విలేకరుల ఆధ్వర్యంలో బహిరంగ చర్చ ఏర్పాటు చేయాలని లేఖ ఇచ్చిన కూడా బహిరంగ చర్చకు ప్రశాంత్‌రెడ్డి రాలేదని, ప్రశాంత్‌రెడ్డి మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటే నిజంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు మంచిచేసింది అని భావిస్తుంటే ఎందుకు చర్చకు రావడం లేదని మానాల చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు మాటాలు మాట్లాడుతూ ఆరోపణలు చేస్తే టిఆర్‌ఎస్‌నాయకులను ప్రశాంత్‌రెడ్డిని గాని బయట తిరగనీయకుండా గ్రామగ్రామాన తరిమి కొట్టేకార్యక్రమం తీసుకుంటామని మానాల హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.