Saturday, May 3, 2025

హిమాయత్ నగర్ లో మెయిన్ రోడ్ పై కుంగిన మ్యాన్ హోల్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని హిమాయత్ నగర్ లో మినర్వా కాఫీ షాప్ కి ఎదురుగా మెయిన్ రోడ్డుపై మ్యానువల్ కుంగింది.  నడిరోడ్డుపై మ్యాన్ హోల్ కుంగుబాటు గురికావడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో సెకండ్ సెకండ్ కు మ్యాన్ హోల్ కుంగు బాటు తీవ్రతరం అవుతుంది.

జిహెచ్ఎంసి అధికారులు కుంగుతున్న మ్యాన్ హోల్ ప్రాంతం వద్ద ప్రమాద సంకేతాన్ని ఏర్పాటు చేయకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు వాహనదారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై జలమండలి అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News