Saturday, April 27, 2024

అమెజాన్ అలెక్సా స్పందనల కోసం నూతన మేల్‌ వాయిస్‌..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దేశవ్యాప్తంగా లక్షలాది మంది Echo డివైజస్‌ను కొనుగోలు చేస్తున్నట్లుగా భారతదేశంలో Amazon యొక్క Alexa ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా Amazon వెల్లడించింది. వినియోగదారులు ఇంగ్లీష్‌, హిందీ మరియు హింగ్లీష్‌ భాషలలో తమ అభ్యర్థనలను సంగీతం, కథలు, జోకులు, న్యూస్‌, సమాచారం, వంటకాలు, అలారం, రిమైడర్స్‌, స్మార్ట్‌ హోమ్‌ కంట్రోల్‌, బిల్‌ చెల్లింపులు మరియు మరెన్నో వాటికి అభ్యర్థనలు చేస్తున్నారు. Echo స్మార్ట్‌ స్పీకర్లపై 2022లో Alexa ద్వారా Amazon షాపింగ్‌ యాప్‌, Fire టీవీ మరియు ఇతర బ్రాండ్లలో Alexa ఆధారిత ఉపకరణాల ద్వారా 2021తో పోలిస్తే అభ్యర్థనలు 37% పెరిగాయి. తద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలోనూ ఇది మార్మోగుతుంది. అత్యధికంగా నూతన వినియోగదారులు తమ Alexa ప్రయాణాన్ని Amazon షాపింగ్‌ యాప్‌ (ఆండ్రాయిడ్‌లో మాత్రమే) ప్రారంభిస్తున్నారు. ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ నెలవారీ యాక్టివ్‌ వినియోగదారుల సంఖ్య 55%కు పైగా ఉంది.

Alexa ఐదవ వార్షికోత్సవాన్ని వేడుక చేస్తూ Amazon ఇప్పుడు Echo స్మార్ట్‌ స్పీకర్లు మరియు Fire టీవీ ఉపకరణాలు సహా అత్యుత్తమంగా విక్రయించబడుతున్న అలెక్సా ఉపకరణాలపై ఆఫర్లను వెల్లడించింది. ఇవి మార్చి 02 నుంచి మార్చి 04,2023 వరకూ లభ్యమవుతాయి. ఈ డీల్స్‌ గురించి మరింత సమాచారం https://amazon.in/alexadeals వద్ద లభ్యమవుతుంది. ఈ విక్రయాలు మార్చి 02, 2023 వ తేదీ ఉదయం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయి. Alexa ఆధారిత ఉపకరణాలపై మరింతగా మీరు పొందడంతో పాటుగా మరెన్నో ఉత్సాహపూరితమైన అంశాలనూ కనుగొనవచ్చు. వినియోగదారులు స్మార్ట్‌ హోమ్‌ గాడ్జెట్స్‌ మరియు Alexa బిల్ట్‌ ఇన్‌ ఉపకరణాలను బోట్‌, నాయిస్‌, ఫిలిఫ్స్‌, సిస్కా మరియు మరెన్నో బ్రాండ్ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.

‘‘తమ రోజువారీ కార్యక్రమంలో భాగంగా Alexaతో ఎంతోమంది భారతీయులు సంభాషిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. భారతదేశం నుంచి, భారతదేశం కోసం Alexa ను నిర్మించాలన్నది మా లక్ష్యం మరియు మా ప్రయాణం దేశంలో యాంబియంట్‌ కంప్యూటింగ్‌ పరిణామానికి పర్యాయంగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. మేము మరింతగా ముందుకు వెళ్తే, వినోదాన్ని పొందడం, టాస్క్‌లను పూర్తి చేయడం మరియు సమాచారాన్ని యాక్సెస్‌ చేయడం కోసం నూతన గొంతుకలు, స్పర్శ, కదలికలు మరియు లక్ష్య– ఆధారిత అనుభవాలను తీసుకురావడంపై మా దృష్టి ఉంటుంది’’ అని కంట్రీ మేనేజర్‌– Alexa, Amazon ఇండియా దిలీప్‌ ఆర్‌ ఎస్‌ అన్నారు

భారతదేశంలో Alexa వినియోగం నిత్యం పెరుగుతూనే ఉంది

జనవరి –డిసెంబర్‌ 2022 మధ్య కాలంలో మ్యూజిక్‌ కోసం Alexa పై అభ్యర్ధనలు దాదాపు 53% పెరిగాయి. వినియోగదారులు Amazon ప్రైమ్‌ మ్యూజిక్‌, స్పాటిఫై , జియో సావన్‌, యాపిల్‌ మ్యూజిక్‌ వంటి మ్యూజిక్‌ ప్రొవైడర్స్‌ ద్వారా వినియోగదారులు స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. వినియోగదారులు 600%పైగా అభ్యర్ధనలను Alexa ఆధారిత Fire టీవీ ఉపకరణాల ద్వారా చేయడంతో పాటుగా తమ అభిమాన కంటెంట్‌ను ప్లే బ్యాక్‌ చేయడం చేస్తుంది. Echo డివైజస్‌పై Alexaతో బిల్లు చెల్లింపులను వినియోగదారులు ఆస్వాదిస్తున్నారు. ఈ తరహా లావాదేవీలు 102% పెరిగాయి. అలాగే స్మార్ట్‌ హోమ్‌ అప్లయెన్సస్‌ నియంత్రణను Alexa ద్వారా 515% వృద్ధి చెందింది. Alexa తో సంభాషించడాన్ని వినియోగదారులు ఆస్వాదించడమనేది ‘Alexa, హౌ ఆర్‌ యు’ (రోజుకు 31,680 సార్లు), మరియు ‘Alexa, ఐ లవ్‌ యు’ (రోజుకు 21,600 సార్లు) అని చెప్పడంలోధ్వనిస్తుంది. వృద్ధి పరంగా చూస్తే ఇది వరుసగా 214% మరియు 275% ఉన్నాయి.

నూతన గొంతుకలో Alexa యొక్క స్పందనలను వినడం

మొట్టమొదటిసారిగా, భారతీయ వినియోగదారులు Alexa యొక్క ఒరిజినల్‌ వాయిస్‌ మరియు నూతన పురుష కంఠ ధ్వని (మస్క్యులైన్‌ సౌండింగ్‌ వాయిస్‌) నడుమ మారడం చేయవచ్చు. నూతన వాయిస్‌ ఇంగ్లీష్‌ , హిందీ భాషలలో మాట్లాడుతుంది. వినియోగదారులు Alexa వాయిస్‌ను ‘Alexa, ఛేంజ్‌ యువర్‌ వాయిస్‌’ అని చెప్పడం ద్వారా Echo ఉపకరణాలు లేదా Alexa యాప్‌పై వ్యక్తిగత పరికరాల అమరిక (ఇండివిడ్యువల్‌ డివైజ్‌ సెట్టింగ్స్‌)పై Alexa వాయిస్‌ను ఎంచుకోవడం ద్వారా మార్చడం చేయవచ్చు. వినియోగదారులు Alexa, Echo, కంప్యూటర్‌ మరియు Amazon అని మేల్కొలుపు పదాలు ఉపయోగించడం ద్వారా ఇంగ్లీష్‌, హిందీ, హింగ్లీష్‌ లో ప్రశ్నలు అడగడం చేయవచ్చు. నూతన వాయిస్‌ అవకాశాల నమూనాలను చూడటం కోసం దయచేసి ఇక్కడ( here ) నొక్కండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News