Wednesday, September 17, 2025

భట్టి పాదయాత్రపై మాణిక్‌రావు ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జిగా మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల కోసమే కెసిఆర్ పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల సంపదను కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. పార్టీ ప్రచారం కోసం వేల కోట్ల ప్రజల సొమ్ము ఖర్చు చేశారని, బిజెపి, బిఆర్ఎస్ రహస్య మిత్రులను ఆరోపించారు. తెలంగాణలో ప్రచారానికి కీలక నేతలు వస్తారని ఆయన వెల్లడించారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News