Thursday, May 2, 2024

కులవృత్తులను ఆదరిస్తున్న మహోన్నత వ్యక్తి సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ సిటీ: రాష్ట్రంలో కుల వృత్తులను ఆదరిస్తూ వారికి అండగా నిలుస్తున్న మహోన్నత వ్యక్తి సిఎం కెసిఆర్ అని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని ఇంద్రాపూర్ యాదవ సంఘంలో నిర్వహించిన పట్టణ యాదవ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని కుల వృత్తుల వారిని ఆదరిస్తూ వారి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నారని అన్నారు. సిఎం ఇచిన మాట ప్రకారం తెలంగాణ సాధించుకునానక గొల్ల కురుమ కులస్తులకు విడతల వారీగా సబ్సిడీ కింద గొర్రెలను పంపిణీ చేశారనిఅన్నారు. పట్టణ యాదవ సంఘానికి ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత రూ.25 లక్షలు మంజూరుచేయడం ఎంతో సంతోషకరమని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకల్లో భాగంగా మరోసారి గొల్ల కురుమ సోదరులకు గొర్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. నగరంలోని వివిధ యాదవ సంఘాల అభివృద్ధికి ఇదివరకే తన ఎంఎల్‌ఏ కోటా సిడిసి నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. తనవంతుగా పట్టణ యాదవ సంఘఢానికి రూ.25లక్షలు నిధులు మంజూరుచేస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ యాదవ సంఘం నూతన కార్యవర్గ అధ్యక్షులు గుర్రం మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి యాదగిరి యాదవ్, కోశాధికారి రఘుయాదవ్, ఉపాధ్యక్షులు చంద్రయ్య యాదవ్, హనుమంతు యాదవ్, ప్రధాన సలహాదారులు మల్లేష్ యాదవ్ (23)వ డివిజన్ కార్పొరేటర్, దేవదాస్ యాదవ్‌లతో నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారంచేయించి సంఘ సభ్యులను అభినందించారు.

సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. యాదవులకు అందరికి ఎల్లపుడు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు మల్లేష్‌యాదవ్, సాయివర్ధన్, దండు శేఖర్, ఆకుల హేమలత, సత్యప్రకాష్, బట్టు రాఘవేందర్, బిఆర్‌ఎస్ నాయకులు, యాదవ సంఘ సభ్యులు, యాదవ కులసంఘ మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News