Monday, May 6, 2024

ఒత్తిడిని జయిస్తే విజయం మనదే

- Advertisement -
- Advertisement -

బాసర : ఆర్జియూకెటి బాసరలోస్టూడెంట్ ఆక్టివిటి సెంటర్‌లో గల ఆడిటోరియంలో మానసిక సమస్యలు పరీక్షల ఒత్తిడి అనే అంశంపై బాలల సంక్షేమ శాఖ నిర్మల్ ఆధ్వర్యంలో పియూసి ప్రథమ సంవత్సరం విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సును ఆర్జియూకెటి వైస్ చాన్సలర్ వెంకటరమణ ఆదేశాలకనుగుణంగా నిర్వహించడం జరిగింది. ఒత్తిడిని జయిస్తే విజయం మనదే. పరీక్షలంటే ముందుగా మనలో భయం పోవాలి. దాన్ని రోటిన్‌గ జరిగే ఒక విషయంగానే అర్ధం చేసుకోవాలి. ఫలితంపై దృష్టిపెట్టే లేనిపోని ఒత్తిడికి గురికావద్దు. మనం చేసే పనిని సవ్యంగా చేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది. మనం చేసేపని ఒక క్రమపద్దతిలో చేయాలి. కేవలం పరీక్షలొస్తున్నాయనో లేదంటే మంచి ర్యాంకు రావాలనో పరీక్షల ముందు మాత్రమే అన్ని మానేసి బట్టి పట్టటం అంత మంచిది కాదు అదేదో మీకు పరీక్షలంటే ఆందోళన, భయం ఉండచ్చు. ఉండటం సహాజం కూడా అదేదో మీకు ఒకరికే ఉందని నేనేమి చేయలేకపోతున్నానని అనుకోవద్దు. ఏదైనా సమస్యలుంటూ టోల్ ప్రీ నెం. 1098 కాల్ చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో డిఆర్‌డివో విజయలక్ష్మీ, బాలల సంరక్షణ అధికారి దేవి, మురళి, లీగల్ ఆపీసర్ నరేంధర్, సోషల్ వర్కర్ కరుణశ్రీ, ఆర్జియూకెటి అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News