Saturday, July 27, 2024

ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీస్

- Advertisement -
- Advertisement -

లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్న హాసన్ లోక్‌సభ స్థానం ఎన్‌డిఎ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణను భారత్‌కు తిరిగి తీసుకురావడానికి బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేయడమైందని, ఇంటర్‌పోల్ సాయం తీసుకుంటున్నామని కర్నాటక హోమ్ శాఖ మంత్రి డాక్టర్ జి పరమేశ్వర ఆదివారం వెల్లడించారు. ఒక నేరానికి సంబంధించి ఒక వ్యక్తి గుర్తింపు, ప్రదేశం లేదా కార్యకలాపాల గురించి తమ సభ్య దేశాల నుంచి అదనపు సమాచారం సేకరణకు అంతర్జాతీయ పోలీస్ సహకార సంస్థ బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేస్తుంటుంది. సెక్స్ కుంభకోణంపై దర్యాప్తునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రజ్వల్‌ను ఏవిధంగా వెనుకకు తీసుకురావాలో నిర్ణయిస్తుందని మంత్రి తెలియజేశారు.

పరమేశ్వర బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ, ‘ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది. ఇంటర్‌పోల్ అన్ని దేశాలకు సమాచారం అందజేసి, ఆయన ఎక్కడ ఉన్నదీ కనిపెడుతుంది’ అని చెప్పారు. సిట్ కృషిని పరమేశ్వర్ శ్లాఘిస్తూ, ఆ బృందం తమ బాధ్యత నిర్వహిస్తున్నదని, తాను అందుకున్న ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్య తీసుకున్నదని తెలిపారు. ప్రజ్వల్ తండ్రి హెచ్‌డి రేవణ్ణ గురించి పరోక్షంగా పరమేశ్వర ప్రస్తావిస్తూ, ‘నిందితుని’ సిట్ అరెస్టు చేసిందని గుర్తు చేశారు. ఒక అపహరణ కేసులో హెచ్‌డి రేవణ్ణను సిట్ శనివారం అరెస్టు చేసింది. జెడి (ఎస్) ఎంఎల్‌ఎ అయిన హెచ్‌డి రేవణ్ణ అత్యాచారం, కిడ్నాపింగ్ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News