Sunday, May 19, 2024

IPL 2024: పంజాబ్ పై చెన్నై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

IPL 2024లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ పై చెన్నై ఘన విజయం సాధించింది. లో స్కోరు ఛేజింగ్ లో పంజాబ్ బోల్తా పడింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బ్యాట్స్ మెన్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో పంజాబ్ 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. చెన్నై బౌలర్లలో జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు.తుషార్ దేశ్ పాండే, సిమర్జీత్ సింగ్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. సాంట్నర్, శార్దుల్ ఠాకూర్ లు ఒక్కో వికెట్ తీశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‪కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. రుతురాజ్ గైక్వాడ్(32), డారిల్ మిచెల్(30), రవీంద్ర జడేజా(43)లు మాత్రమే రాణించారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు, శామ్ కరన్ ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News