Saturday, July 27, 2024

మణిపూర్ సిఎం కాన్వాయ్‌పై కాల్పులు

- Advertisement -
- Advertisement -

జాతుల మధ్య వైరంతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో ఏకంగా ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పై సోమవారం ఉదయం దాడికి ప్రయత్నాలు జరిగాయి. సాయుధులైన తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని సీఎం కార్యాలయానికి చెందిన వర్గాలు వెల్లడించాయి. కాంగ్‌పోక్సి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల జిరిబామ్ జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన తరువాత రాష్ట్రంలో ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. 70 కి పైగా ఇళ్లు తగుల బెట్టారు. మరికొందరు పౌరులు వేరే చోటుకు పారిపోయారు.

ఎన్నికల సమయంలో తమ వద్ద నుంచి లైసెన్స్ తుపాకులను జప్తు చేయడంతో వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ స్థానికులు జిల్లా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఈ విధంగా అలజడులతో ఉన్న ఈ ప్రాంతాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ ఇంఫాల్ నుంచి జిరిబామ్‌కు బయలుదేరగా, ఆయన కాన్వాయ్‌పై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో బీరేన్‌సింగ్ పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. అయితే సిబ్బందిలో ఒకరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. రాష్ట్రంలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News