Thursday, September 18, 2025

త్రిషపై ‘మన్సూర్ ’ వివాదాస్పద వ్యాఖ్యలు..

- Advertisement -
- Advertisement -

చెన్నై : నటి త్రిషను ఉద్దేశించి నటుడు మన్సూర్ అలీఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ (ఎస్‌ఐఐఎ ) ఆదివారం ఆగ్రహం వెలిబుచ్చింది. దీనికి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. త్రిషతోపాటు మరో కుష్బూ, రోజా లపై ఇటీవల అభ్యంతరకరమైన, అగౌరవనీయమైన వ్యాఖ్యలు మన్సూర్ చేశారని, ఆయన క్షమాపణ చెప్పేవరకు ఖాన్ సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేయాలని ఎస్‌ఐఐఎ డిమాండ్ చేసింది. నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వూలో ‘లియో’ లో త్రిషతో ఓ సీన్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

“ గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్ సీనులో నటించా. లియోలో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతో అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నా. కాకపోతే అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించింది ” అని మన్సూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖాన్ వ్యాఖ్యలను త్రిష తీవ్రంగా ఖండించారు. త్రిష ఆవేదనకు స్పందించిన కుష్బు ఎన్‌సిడబ్లు సభ్యురాలిగా మన్సూర్‌పై చర్య తీసుకోవడమౌతుందని పేర్కొన్నారు. సినీ డైరెక్టర్ , రచయిత లోకేష్ కనగరాజ్ ఖాన్ వ్యాఖ్యలకు ఆవేదన చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News