Friday, March 1, 2024

ఆ విలన్.. చిరంజీవిపై 20 కోట్లకు దావా వేస్తాడట!

- Advertisement -
- Advertisement -

త్రిషపై అసభ్య కామెంట్లు చేసి ఇరుకునపడిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్.. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకోవట్లేదు. అందరూ తనకు చీవాట్లు పెట్టడంతో త్రిషకు సారీ చెప్పినా, తగ్గేదే లేదంటున్నాడు. పైగా అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లు చిరంజీవి మీద నోరు పారేసుకున్నాడు. త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలను ఖండించినందుకు   ఇప్పుడు మెగాస్టార్ ను టార్గెట్ చేశాడు.

మన్సూర్ చిరుపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చిరుని ఆడిపోసుకున్న మన్సూర్ పై మెగా అభిమానులు మండిపడుతున్నారు. చిరంజీవి పొలిటకల్ పార్టీ పెట్టి వేల కోట్లు సంపాదించుకున్నా, పేదవాళ్లకు ఏమీ సాయం చేయలేదని మన్సూర్ వ్యాఖ్యానించాడు. ‘ప్రతి ఏటా హీరోయిన్లకు చిరంజీవి పార్టీ ఇస్తాడు, నన్నెప్పుడూ పిలవలేదు. అది ఆయన ఇష్టం. కానీ నన్ను ఒక్కమాటయినా అడగకుండా మాట్లాడటం నన్ను బాధపెట్టింది’ అని మన్సూర్ అన్నాడు.

చిరంజీవిపై 20 కోట్లకు, త్రిష, ఖుష్బూలపై 10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తాననీ, కేసు గెలిస్తే, ఆ డబ్బును పేదలకు పంచుతాననీ మన్సూర్ అన్నాడు. త్వరలోనే తన లాయర్లు వారికి నోటీసులు పంపుతారని చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News