Wednesday, September 11, 2024

నీరజ్ చోప్రాతో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన మను బాకర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో తాను ప్రేమలో ఉన్నట్టు వస్తున్న వార్తలను భారత షూటింగ్ సంచలనం మను బాకర్ ఖండించింది. తాను, నీరజ్ ప్రేమీంచుకుంటున్నట్టు కొంత మంది ప్రచారం చేయడం బాధగా ఉందని పేర్కొంది. నీరజ్‌తో తనకు అంతగా ఇంటరాక్షన్ లేదు. వివిధ పోటీలు, ఇతర కార్యక్రమాల్లో ఎదురుపడినప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం.

అంతేకానీ తాము ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో కొందరు పనిపట్టుకుని ప్రచారం చేయడం ఏమాత్రం బాగలేదని వ్యాఖ్యానించింది. ఈ మధ్య తాను నీరజ్‌తో మాట్లాడాను. ఆ సమయంలో ఎవరో దాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తమ మధ్య ఏదో ఉన్నట్టు ఊహగానాలు చెలరేగాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అభిమానులు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మను బాకర్ స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News