Saturday, October 12, 2024

ప్రేయసిని కలిసేందుకు వచ్చి… పోలీసులకు దొరికిన మావోయిస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రేయసిని కలిసేందుకు వచ్చి మావోయిస్టుని పోలీసులు పట్టుకున్న సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. నేర నియంత్రణ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…… అనిరుద్ధ్ రాజన్ అనే యువకుడు సిపిఐఎంఎల్ పార్టీలో కీయాశీలక సభ్యుడిగా పనిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.  గతంలో అనిరుద్ధ్ పై రచనలను, సాహిత్యాన్ని పంపిణీ చేశాడనే నేరాబియోగం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేయసి కోసం అతడు హర్యానా నుంచి బెంగళూరుకు వచ్చాడు.

నాలుగు రోజుల నుంచి బెంగళూరులోని ఓ లాడ్జ్ లో ఉన్నట్టు సిసిబి అధికారులకు సమాచారం అందింది. వెంటనే సిసిబి పోలీసులు ఉప్పారపేట పోలీసులు సహాయంతో అతడు ఉంటున్న లాడ్జ్ పై దాడులు నిర్వహించారు. అనిరుద్ధ్ అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అనిరుద్ధ్ వద్ద వికాస్ ఫాడ్గే పేరిటి ఆధార్ కార్డు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆర్టిసి బస్సులో చెన్నై వెళ్లేందుకు సన్నాహాలు చేస్తుకుంటున్న సమయంలోనే అతడిని అరెస్టు చేశామని సిసిబి అధికారులు వెల్లడించారు. అతడి నుంచి నాలుగు సంచులు, పెన్ డ్రైవ్ లు, ట్యాబ్ లను స్వాధీనం చేసుకున్నారు. అతడిని నుంచి మరిన్ని వివరాలు తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News