Friday, July 18, 2025

రాచకొండ సిపి ముందు కీలక మావోయిస్టులు లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో మరో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. రాచకొండ సిపి ముందు జన నాట్య మండలి ఫౌండర్ సంజీవ్, అతడి భార్య దీనా లొంగిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు సంజీవ్, దీనాను రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. గద్దర్ తో పాటు సంజీవ్ జన నాట్యమండలి వ్యవస్థాపకుడిగా ఉన్నారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ సెక్రటరీగా సంజీవ్ సేవలందించారు. మావోయిస్టుల కోసం  పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి అనే అవగాహన కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News