Sunday, June 4, 2023

బిక్కనూరులో అనుమానస్పదంగా వివాహిత మృతి..

- Advertisement -
- Advertisement -

బిక్కనూర్ : అనుమానస్పదంగా ఓ వివాహిత తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని లక్ష్మీనగర్ తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బిక్కనూర్ మండలంలోని లక్ష్మీనగర్ తండా గ్రామానికి చెందిన బానోత్ కళావతి 28 అనే మహిళకు గత పది సంవత్సరాల క్రితం అదే తండాకు చెందిన బానోత్ పాండుతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. ఇటీవల ఇంట్లో గొడవలు జరుగుతున్న క్రమంలో కళావతి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శుక్రవారం రాత్రి ఆమె భర్త పాండు అత్త,మామ, ఆడపడుచులు కలిసి గొడవపడినట్లు చుటుపక్కల వారు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతురాలి తండ్రి విఠల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతికి గల కారణాలను భర్త పాండు, చుటుపక్కల వారితో అడిగి తెలుసుకున్నారు. శవాన్ని పోస్టుమార్ట నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనుమానస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News