Thursday, October 10, 2024

ప్రైవేట్ బస్సులో వివాహితపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళపై క్లీనర్ ఆత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎపిలోని సామర్లకోటకు చెందిన వివాహిత (28) హైదరాబాద్‌లోని ఒక ప్రాంతంలో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. సొంతూరు సామర్లకోట వెళ్లేందుకు ఈ నెల 18న రాత్రి కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. బస్సు కదిలిన కొద్దిసేపటికి స్లీపర్ కోచ్‌లో ఉన్న ఆమెను క్లీనర్ రెడ్డి సాయికుమార్ బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొదని బెదిరించాడు. బాధితురాలు సామర్లకోటలోని తన ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇదిలావుండగా, బాధితురాలు తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని చౌటుప్పల్ పిఎస్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ కేసును కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. ఈ మేరకు దర్యాప్తు చేసి నిందితుడు రెడ్డి సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News