Saturday, September 21, 2024

దూసుకుపోతున్న ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’

- Advertisement -
- Advertisement -

విలక్షణ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రానికి బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 23న విడుదలైంది.

ఈ సినిమాకు మీడియా నుంచి మంచి రివ్యూలు, ఆడియెన్స్ నుంచి మంచి మౌత్ టాక్ రావడంతో యూనిట్ అంతా సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను చేసుకుంది. ఈ క్రమంలో నిర్వహించిన థాంక్స్ మీట్ ఈవెంట్‌లో రావు రమేష్ మాట్లాడుతూ.. ‘మా సినిమాలో ఇంద్రజ నటన చూసి షాక్ అయ్యాను. ఆమె డ్యాన్స్, ఎనర్జీకి దండం పెట్టాల్సిందే. అంకిత్ కొయ్య చాలా మంచి నటుడు. పాత్రకు కరెక్ట్‌గా సరిపోయాడు. మా ఇద్దరి మధ్య మంచి సీన్లు ఉన్నాయి. లక్ష్మణ్ అన్ని పాత్రలను అద్భుతంగా రాశారు. కళ్యాణ్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్, ఆర్‌ఆర్ ఇచ్చారు’ అన్నారు.

డైరెక్టర్ లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మా సినిమాను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తుంటే మా కడుపులు నిండినట్టుగా అనిపిస్తోంది’ అని తెలిపారు. తబితా సుకుమార్ మాట్లాడుతూ.. ‘చంద్రబోస్ మా కోసం పాటను రాశారు. అంత మంచి పాటను రాసిన ఆయనకు థాంక్స్. ‘పుష్ప’ షూటింగ్‌లో బిజీగా ఉండి కూడా మా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మా ఆయన సుకుమార్‌కి థాంక్స్. థియేటర్లో మా సినిమాను చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, కళ్యాణ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News