Sunday, September 15, 2024

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

కారులో తరలిస్తున్న డ్రగ్స్‌ను బోయిన్‌పల్లి, హెచ్‌న్యూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి యాంఫెటమైన్ డ్రగ్స్ 8.5కిలోల డ్రగ్స్, కారు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.8కోట్లు ఉంటుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఐసిసిసిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని బిట్రగుంటకు చెందిన కుంచాల నాగరాజు అలియాస్ నాగరాజు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఉంటున్నాడు, ఆశగోని వినోద్ కుమార్, దుండిగల్‌కు చెందిన కుంతి శ్రీశైలం డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. శ్రీశైలం పరారీలో ఉన్నాడు. కుంచాల నాగరాజు పతోతరగతి వరకు చదువుకున్నాడు. త ర్వాత తాపీమేస్త్రీ పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్ తయారు చేసే గోసుకొండ అంజిరెడ్డి పరిచయం ఏర్పడింది. అంజిరెడ్డి తను పనులు చేయాలని నాగరాజుకు చెప్పడంతో అతడి ఫంక్షన్ హాల్స్, ఫ్యాక్టరీ పనులు, గోడౌన్లను కట్టాడు.

ఇద్దరి మధ్య సన్నిహితం ఏర్పడడంతో అంజిరెడ్డి ఆల్ఫాజోలుం తయారు చేసి కల్లుదుకాణాలకు విక్రయించడం గమనించాడు. అతడి వద్ద ఆల్ఫాజోలుం కొందరు కొనుగోలు చేసి సులభంగా డబ్బులు సంపాధించాడం చూశాడు. తనతో చేతులు కలిపితే సులభంగా డబ్బులు సంపాదించవచ్చని అంజిరెడ్డి, నాగరాజుకు చెప్పాడు. దీనికి నాగరాజు అంగీకరించడంతో జూన్,2024న అంజిరెడ్డి, నాగరాజును బొంతపల్లికి పిలించాడు, మూడు బ్యాగుల్లో ఉన్న డ్రగ్స్‌ను ఇచ్చి వాటిని తాను చెప్పిన వారికి డెలివరీ చేయాలని చెప్పాడు. డ్రగ్స్ తీసుకుని బయలుదేరిన నాగరాజు, అంజిరెడ్డి చెప్పిన వ్యక్తికి ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే హెచ్‌న్యూ పోలీసులు గుమ్మిడాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలోని అంజిరెడ్డి ఫ్యాక్టరీపై దాడి చేసి ఆల్ఫాజోలును స్వాధీనం చేసుకుని అతడిని జైలుకు పంపించారు. తర్వాత నాగరాజుకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో అంజిరెడ్డి తయారు చేసిన డ్రగ్స్ యాంఫెటమైన్ 8.5కిలోలను అవసరం ఉన్న వారికి విక్రయించాలని ప్లాన్ వేశాడు.

దీని కోసం వినోద్‌కుమార్, శ్రీశైలంను సంప్రదించాడు. ముగ్గురు కలిసి డ్రగ్స్ హైదరాబాద్‌కు తీసుకురావడానికి ప్లాన్ వేశారు. ఆదివారం సాయంత్రం మహేంద్ర జైలో కారులో డ్రగ్స్ పెట్టుకుని నగరానికి బయలుదేరారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సుచిత్ర చౌరస్తా నుంచి ప్యారడైజ్ వైపు వస్తుండగా వారిని పోలీసులు వెంబడించి బోయిన్‌పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు.

బానిసను చేస్తుంది…
యాంఫెటమైన్ డ్రగ్స్‌ను ఎక్కువగా కూల్‌డ్రింక్స్‌లో కలిసి ఇస్తుంటారు. డ్రగ్స్‌కు బానిసలుగా చేసేందుకు ముందుగా దీనిని ఇస్తుంటారు, దీనితోనే ఎండిఎంఏ డ్రగ్స్‌ను తయారు చేస్తుంటారు. ఒక్కసారి యాంఫెటమైన్‌ను తీసుకుంటే దానికి బానిసలుగా మారుతారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News