Thursday, April 18, 2024

పాకిస్థాన్‌లో భారీ భూకంపం

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఆదివారం ఉదయం వివిధ ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్డార్ స్కేలుపై 6.0 తీవ్రత చూపించిన ఈ భూకంపం అఫ్గానిస్థాన్, తజకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో 223 కిమీ లోతున కేంద్రీకృతమైంది.

అయితే దీని తీవ్రత తరువాత తగ్గిందని ఇస్లామాబాద్‌కు చెందిన జాతీయ భూకంప పర్యవేక్షక కేంద్రం వెల్లడించింది. దీని ప్రకంపనలు ఇస్లామాబాద్, పెషావర్, స్వాత్, హరిపుర్, మలకండ్, అబ్బోట్టాబాద్, బాత్‌గ్రామ్, పాక్ ఆక్రమిత కశ్మీర్, టెక్సిలా, పిండ్ దాన్ ఖాన్, తదితర ప్రాంతాల్లో వ్యాపించాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News