Monday, April 29, 2024

7 అంతస్తుల భవనంలో మంటలు..ఏడుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ముంబై : మహానగరం ముంబైలో అగ్నిమాపక వ్యవస్థ అసలుకే లేని ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున స్థానిక గోరేగావ్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు ఊపిరాడక మృతి చెందారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. 40 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఏడు అంతస్తుల రెసిడెన్షియల్ భవనం జై భవానీ ఎస్‌ఆర్‌ఎ బిల్డింగ్‌లో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అంతా నిద్రలో ఉండగా మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ 5 లక్షల చొప్పున సాయం అందిస్తారు. గాయపడ్డ వారికి ప్రభుత్వం చికిత్స జరిపిస్తుందని సిఎం తెలిపారు. ఘటనపై బిఎంసి కమిషనర్ ఇక్బాల్ సింగ్ ఛాహల్ విలేకరులతో మాట్లాడారు. మంటల్లో ఎవరూ చనిపోలేదని, దట్టమైన పొగలతో ఊపిరాడని స్థితిలో చనిపోయారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News