Tuesday, September 17, 2024

క్రీమీలేయర్ సాకుతో కోటాలో కోతలకు కుట్ర

- Advertisement -
- Advertisement -

లక్నో : న్యూఢిల్లీ : క్రీమీలేయర్ విషయా న్ని ప్రాతిపదికగా చేసుకుని ఎస్‌సి/ ఎస్‌టిలకు రిజర్వేషన్ల కోటాలో కోతలు విధిస్తామంటే కుదరదని కాంగ్రెస్ నేత మల్లిఖార్జు న ఖర్గే స్పష్టం చేశారు. చిత్తశుద్ధి ఉంటే కేం ద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పు ను పార్లమెంట్ ద్వారా చెల్లనేరకుండా చే యాల్సిన నైతిక బాధ్యత ఉందని, అది జరగలేదని ఖర్గే విమర్శించారు. కోటాకు ని యంత్రణలు వంటి ఆలోచన ఏదైనా ఉం టే అది గర్హనీయం అవుతుందని విమర్శించారు. క్రీమీలేయర్‌ను వర్తింపచేయాలనే విధంగా వెలువడ్డ ఇటీవలి సుప్రీంకోర్టు తీ ర్పు చెల్లనేరకుండా ఇటీవలి సెషన్‌లో ప్ర భుత్వం బిల్లు తీసుకురావాలి.అయితే మో డీ ప్రభుత్వం ఈ పని చేయలేదన్నారు. సు ప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన ఎస్‌సి, ఎస్‌టి ఉప వర్గీకరణ సంబంధిత క్రీమీలేయర్ ప్రస్తావన నేపథ్యంలో ఖర్గే శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఈ పనిచేయకుండా, కీలక విషయాన్ని దాటేసిందని
మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను ప్రస్తావిస్తూ ,

క్రీమీలేయర్ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ఏ వర్గానికి మేలు చేయదల్చుకున్నారని , ఇది న్యాయమూర్తుల పట్ల తన ధర్మసందేహం అని వ్యాఖ్యానించారు. ఓ వైపు ఇంతకాలం అంటరాని వాళ్లుగా సమాజంలో వెలివేయబడినట్లుగా ఉన్న వారిని కాదంటూ , వేలాది సంవత్సరాలుగా పలు రకాల మన్ననలు పొందిన వారి పక్షాన తీర్పు వెలువడినట్లుగా ఉందని , వారి హక్కులు వీరికి కల్పించే దిశలో అడుగులు వేసినట్లు ఉందని విమర్శించారు. అంటరానితనం ఉన్నంత కాలం, రిజర్వేషన్లు ఉండాల్సిందే. వీటి కోసం తాము పాటుపడుతామని, పోరాడుతామని తెలిపిన ఖర్గే , రిజర్వేషన్ల విషయంలో బిజెపి డ్రామా అడుతోందని, మోడీ ప్రభుత్వానికి రిజర్వేషన్లకు చరమవాక్యం పలుకాలనేదే ఆలోచన అని, ఇందుకు సాకులు వెతుక్కుంటూ వచ్చిందని, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు ఈ అధికార పక్షానికి ఆలంబన అయిందని ఖర్గే విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని సహించేది లేదని, రిజర్వేషన్ల కోటాను పరిరక్షిస్తామని ప్రకటించారు. తీర్పునకు గుర్తింపు దక్కకుండా , ఇది వీగిపోయేలా జనమంతా చురుగ్గా సంఘటితంగా వ్యవహరించాల్సి ఉందని పిలుపు నిచ్చారు. మరో మారు రిజర్వేషన్ల విషయం ఏ వేదికపైనా ప్రస్తావనకు రాకుండా యధాతథ స్థితి కొనసాగేలా చూడాల్సి ఉందన్నారు.

ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి
దేశంలో రిజర్వేషన్ల కోటాలోని ప్రస్తుత కీలక అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని బిఎస్‌పి అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఎస్‌సిల వర్గీకరణ, ఉపవర్గీకరణ , క్రీమీలేయర్ ప్రస్తావనకు తాము వ్యతిరేకం అని ఆమె స్పష్టం చేశారు. ఎస్‌సి/ఎస్‌టి ఉప వర్గీకరణ రాష్ట్రాలు చేయవచ్చునని, ఇందుకు రాష్ట్రాలు విధివిధానాలను రూపొందించుకోవచ్చునని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే మాయావతి ఈ తీర్పులోని అంతర్గత , చెప్పిచెప్పకుండా నిక్షిప్తంగా ఉన్న పలు విషయాలను ప్రస్తావించారు. తీర్పులో విస్తృత ధర్మాసనం ఉప వర్గీకరణల దశలో క్రీమీలేయర్ విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

మారుతున్న కాలం, తరాలుగా కొందరు రిజర్వేషన్ల కోటా అనుభవిస్తూ , వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చుకున్నందున సరికొత్తగా క్రీమీలేయర్ పరిధిని నిర్వచించాల్సి ఉందని సూచించింది. ఇది అత్యంత ప్రధానమైన, కోటాను ప్రభావితం చేసే విషయం అయి ఉన్నందున దీనిపై ప్రధాన ప్రతిపక్షం వైఖరి ఏమిటీ? దీనిపై పార్లమెంట్‌లోనూ , బయట కాంగ్రెస్ ఎందుకు మౌనం పాటిస్తోందని బిఎస్‌పి నాయకురాలు నిలదీశారు. పలు కారణాలతో రాజ్యాంగ నిర్ధేశిత రిజర్వేషన్ల అమలు అచేతనం అయింది. దీనిని తిరిగి చేతనం, సమర్థవంతం చేయాల్సి ఉంది. అందుకే అన్ని విషయాలను విశ్లేషించేందుకు స్పెషల్ పార్లమెంట్ సమావేశం ఏర్పాటు కావల్సిందే అని ఆమె సూచించారు. లక్నోలో మాయావతి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

కాంగ్రెస్, బిజెపి ఇతర పార్టీలు రిజర్వేషన్లపై నోరుమెదపాలి
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇరుశిబిరాల్లో పలు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. మరి అత్యంత కీలకమైన విషయంపై , ప్రత్యేకించి క్రీమీలేయర్ ప్రస్తావనపై అన్ని పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాల్సి ఉందని మాయావతి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రాలు యధేచ్ఛగా కోటాలను ఖరారు చేస్తే, ఉపవర్గీకరణ అంశం పక్కకు పోయి, రిజర్వేషన్లకు విఘాతం ఏర్పడుతుందని మాయావతి తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్రంలో, పలు రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయి, ఎస్‌పి, ఆప్ వంటి శక్తివంతమైన పార్టీలు కూడా క్రీమీలేయర్ విషయం, కోటా విషయం గురించి ఎందుకు మాట్లాడటం లేదని మాయావతి ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు అంతర్గతంగా కోటా విషయంలో అనుసరిస్తూ వస్తున్న వ్యూహాత్మక వైఖరి పట్ల దేశంలోని బడుగు ఎస్‌సి, ఎస్‌టి ఇతరత్రా దళిత వర్గాలు అప్రమత్తంగా ఉండాలని మాయావతి హెచ్చరించారు. అన్ని పార్టీలకు ఓ దాగుడుమూతల వైఖరి ఉన్నట్లు స్పష్టం అవుతోందని, వీరి నిజస్వరూపాలు వెలుగులోకి రావల్సి ఉందన్నారు.

రాజ్యాంగం , రిజర్వేషన్ల రక్షణ అన్నావ్ కదా రాహుల్
రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ పేరిట ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కొన్ని పార్టీలు తమ సీట్ల సంఖ్య పెంచుకున్నాయని, రిజర్వేషన్లను రక్షిస్తామని, రాజ్యాంగాన్ని దెబ్బతీయబోనివ్వమని ఓ పార్టీ కీలక నేత పదేపదే చేతిలో పుస్తకంతో ముందుకు సాగారని మాయావతి పరోక్షంగా రాహుల్‌ను విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News