Thursday, October 10, 2024

నేడు ఎంబిబిఎస్ కన్వీనర్ కోటా

- Advertisement -
- Advertisement -

విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టు విడుదల
కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ
వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబిబిఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును బుధవారం(సెప్టెంబర్ 25) ఉదయం విడుదల చేస్తామని కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. గురువారం తుది మెరిట్ లిస్టును విడుదల చేస్తామని, అదే రోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.

కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గత సంవత్సరానికి సంబంధించిన కాలేజీ వారిగా సీట్ల కేటాయింపు వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, వాటిని పరిశీలించి వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకుంటే, ఆప్షన్ల నమోదు ప్రక్రియ సులభం అవుతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News