Friday, April 19, 2024

ఆర్టీసీ ప్రయాణం సౌకర్యవంతం, సురక్షితం

- Advertisement -
- Advertisement -

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్: ఆర్టీసీ ప్రయాణం సౌకర్యవంతం, సురక్షితమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్ ఆర్టీసీ డిపో ఆవరణలో మూడు డీలక్స్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. నూతన బస్‌లో టికెట్ తీసుకుని ప్రయాణికులు ప్రజాప్రతినిధులతో కలిసి డిపో నుంచి కలెక్టరేట్ వరకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ… మెదక్ నుంచి సికింద్రాబాద్‌కు 3 బస్సులను గతంలో గతంలో 2 బస్సులను ప్రారంభించడం జరిగిందన్నారు. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థిని, విద్యార్థులు హాల్ టికెట్ చూయిస్తే ఉచిత బస్సు సౌకర్యం ప్రభుత్వం కల్పించడం జరిగిందన్నారు.

ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు మెదక్ నుంచి బస్సు కావాలని డిమాండ్ ఉండటంతో యాదగిరిగుట్టకు బస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మెదక్ నుంచి ఒక ఏసీ మినీ బస్సు కావాలని పట్టణ ప్రజలు కోరడం జరిగిందని దానిని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపించడం జరిగిందన్నారు. మెదక్ 5 బస్సులు నర్సాపూర్‌కు డిపో మంజూరు చేసి 15 బస్సులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ఆర్టీసీ సిబ్బంది, ఆర్‌ఎం, డిఎం, ప్రత్యేక కృషి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ఆర్టీసీ ఆర్‌ఎం సుదర్శన్, ఆర్టీసీ డిఎం రవిచంద్ర, మెదక్ పట్టణ పార్టీ అద్యక్షులు గంగాధర్, కౌన్సిలర్లు సమియోద్దీన్, బీమరి కిశోర్, ఆర్‌కె శ్రీనివాస్, లక్ష్మీనారాయణగౌడ్, కోఆప్షన్ మెంబర్ సయ్యద్ ఉమర్, నాయకులు రాగి అశోక్, శ్రీదర్ యాదవ్, దుర్గాప్రసాద్, శివరామకృష్ణ, కొండ శ్రీనివాస్, బాని, సున్నం నరేష్, ఆర్టీసీ సిబ్బంది, సంగమేశ్వర్, సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ వీరబాబు, జూనియర్ క్లార్క్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News