Friday, September 5, 2025

రేప్ కేసులో 20ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ మేడ్చల్ పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఎపిలోని ఈస్ట్‌గోదావరి జిల్లాకు చెందిన అడ్డాల నాని(28) అల్వాల్‌కు బతుకు దెరువు కోసం వచ్చి కూలీ పనులు చేస్తున్నాడు. తన ఉంటున్న ఇంటికి సమీపంలో ఉంటున్న బాలికతో సన్నిహితంగా మెలిగాడు. ఈ క్రమంలోనే బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అప్పటి ఇన్స్‌స్పెక్టర్ యాదగిరి దర్యాప్తు చేసి కోర్టులో సాక్షాలు సమర్పించారు. వాటిని పరిశీలించి కోర్టు నిందితుడు జైలు శిక్ష, జరిమానా విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News