Friday, March 29, 2024

దీపావళి కానుకగా…

- Advertisement -
- Advertisement -

Mega 154 Title Teaser to release on Oct 24

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ(కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపు దిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మెగా 154’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్‌లో పోషిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు తెప్పించేలా ‘మెగా154’ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ముహూర్తం ఫిక్స్ చేస్తూ మెగా అప్‌డేట్ ఇచ్చారు. ఈనెల 24న ఉదయం 11:07 గంటలకు టైటిల్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో చిరంజీవి మాస్ లుక్ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. పోస్టర్‌పై ‘బాస్ వస్తున్నాడు’ అని రాయడం ఈ సినిమాపై అంచనాలని మరింత పెంచేసింది. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె.చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

Mega 154 Title Teaser to release on Oct 24

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News