Friday, September 13, 2024

అది భారత్ పాలకులకు గుణపాఠం: మెహబూబా ముఫ్తీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నియంతృత్వ పాలన ఎక్కువ కాలం మనలేదని కశ్మీర్ కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిడిపి) చీఫ్ ముఫ్తీ మెహబూబా స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలు భారత పాలకులకు గుణపాఠం వంటివని ఆమె అన్నారు. ‘‘యువతను అణచివేస్తే తిరుగుబాటు వస్తుంది. ద్రవ్యోల్బణం కట్టడి చేయకుండా, నిరుద్యోగాన్ని పరిష్కరించకుండా, ప్రజలను విద్యకు దూరం చేయాలని చూస్తే బంగ్లాదేశ్ మాదిరి పరిస్థితులు భారత్ లోనూ రావొచ్చు’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘షేక్ హసీనా ఎదుర్కొన్న అనుభవాన్నే భారత పాలకులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి’’అని ఆమె స్పష్టం చేశారు. ‘‘బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు కశ్మీర్ లో కూడా ఉన్నాయి. చట్టాలతో కశ్మీర్ యువత విసిగిపోయారు. అయితే బంగ్లాదేశ్ తరహా తిరుగుబాటు కశ్మీర్ లో తలెత్తకూడదని నేను కోరుకుంటున్నాను’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News