Tuesday, September 26, 2023

ఔటర్ చుట్టూ మెట్రో

- Advertisement -
- Advertisement -

కాలుష్యాన్ని, ట్రాఫిక్ రద్దీని నివారించే ఏకైక మార్గం మెట్రోకు ఉంది హైదరాబాద్‌లో దానిని ఇంకా
విస్తరించాలి నేడు ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ చాలా గొప్పగా జనాభా
పెరుగుదలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుకోవాలి ప్రాథమిక అవసరాల్లో ముందుండాలి
మెట్రో రెండో విస్తరణ పనుల శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

భవిష్యత్‌లో హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తాం. కేంద్ర సహకారం ఉన్నా లేకున్నా మెట్రోను నిర్మిస్తాం. మైండ్ స్పేస్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కి.మీ. వరకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండిఎ, జిఎంఆర్ నిధులతో నిర్మాణం చేసుకుంటున్నాం. ప్రపంచంలో కాలుష్యాన్ని, ట్రాఫిక్ రద్దీని నివారించే ఏకైక మార్గం మెట్రోకు ఉంది. హైదరాబాద్‌లో దానిని ఇంకా విస్తరించాల్సి ఉంది. బిహెచ్‌ఇఎల్ నుంచి మెట్రో రావాలి. దీంతోపాటు హైదరాబాద్ చుట్టూ మెట్రో రావాల్సి ఉంది.

కాలుష్యాన్ని, ట్రాఫిక్ రద్దీని నివారించే
ఏకైక మార్గం మెట్రోకు ఉంది
నేడు ట్రాఫిక్ ఫ్రీ సిటీగా
హైదరాబాద్ మారుతోంది
మెట్రో రెండో విస్తరణ పనుల
శంకుస్థాపన సభలో సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : భవిష్యత్‌లో హైదరాబా ద్ ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని సి ఎం కెసిఆర్ ప్రకటించారు. కేంద్ర సహకారం ఉన్నా లే కున్నా మెట్రోను నిర్మిస్తామని సిఎం స్పష్టం చేశారు. తొ లుత భూమి పూజ నిర్వహించి, మెట్రోకు శంకుస్థాపన చేసిన సిఎం కేసీఆర్, అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మైండ్‌స్పేస్ టు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ రకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో పనుల కు సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం రా జేంద్రనగర్ పోలీసు అకాడమీ మైదానంలో ఏర్పాటు చే సిన బహిరంగ సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు.

మైండ్ స్పేస్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరం వరకు వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండిఏ, జిఎంఆర్ నిధులతో నిర్మాణం చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రపంచంలో కాలుష్యాన్ని, ట్రాఫిక్ రద్దీని నివారించే ఏకైక మార్గం మె ట్రోకు ఉందని, హైదరాబాద్‌లో దానిని ఇంకా విస్తరించాల్సి ఉందని ఆయన తెలిపారు. బీహెచ్‌ఈఎల్ నుంచి మెట్రో రావాల్సి ఉందని, దీంతోపాటు హైదరాబాద్ చు ట్టూ మెట్రో రావాల్సి ఉందని కెసిఆర్ తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని కెసిఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ సుప్రసిద్ధ నగరం
హైదరాబాద్ సుప్రసిద్ధ నగరమని, ఒక సందర్భంలో దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా వైశాల్యంలో, జనాభాలో హై దరాబాద్ పెద్దదని ఆయన తెలిపారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగ రం దేశంలోని అనేక నగరాల కన్నా ముందుగా 1912 లోనే ఎలక్ట్రిసిటీ వచ్చిన నగరమని కెసిఆర్ పేర్కొన్నారు. మనకు 1912లో కరెంట్ వస్తే చెన్నై నగరానికి 1927 లో కరెంట్ వచ్చిందన్నారు. చరిత్రలో నిజమైన కాస్మోపాలిటన్ సిటీగా అన్ని వర్గాలను, కులాలను, మతాలను, ప్రాంతాలను, జాతులను అక్కున చేర్చుకునే అద్భుతమై న విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ ఈ రోజు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కోసం మెట్రోకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్, హెచ్‌ఎండిఏ, మెట్రో రైలుతో పాటు జిఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులను, సిబ్బందిని సిఎం కెసిఆర్ అభినందించారు.
వర్తమానంలో కూడా నగరం గొప్పది
నగరం చరిత్రలోనే గొప్పది కాదనీ, వర్తమానంలో కూడా చాలా గొప్పదని కెసిఆర్ పేర్కొన్నారు. దేశంలో ఏ నగరంలో లేనటువంటి సమశీతల వాతావరణం మనదగ్గర ఉందన్నారు. భూంకపాలు రాకుండా, భూగోళం మీదనే సేఫేస్ట్‌గా ఉండే నగరం హైదరాబాద్ అని అన్ని భాషలు, సంస్కృతులు కలిగిన ఉన్నవారు ఇక్కడ అనేకమంది ఉన్నారని ఆయన తెలిపారు. అనేక రాష్ట్రాలు, దేశాల నుంచి ఈ నగరంలో సహజీవనం సాగిస్తున్నారన్నారు. గుల్జార్ హౌస్ వద్ద 300 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రజలు ఉన్నారని, ఈ కల్చర్ మన సొంతమని, గతంలో హైదరాబాద్ నగరం గొప్పగా ముందుకు పోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య పాలకుల వల్ల చాలా బాధలు అనుభవించామని, తమకు కరెంట్ ఇవ్వండి, సరిపోవడం లేదు, కార్మికులు ఇబ్బందులు పడుతూ వేరే రాష్ట్రాలకు తరలిపోతామని పారిశ్రామిక వేత్తలు ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
గతంలో ఏ బస్తీకి వెళ్లినా….
హైదరాబాద్‌లో గతంలో ఏ బస్తీకి వెళ్లినా భయంకరమైన మంచినీటి బాధలను చూశామని, అనుభవించామని కెసిఆర్ పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నుంచి నీటి సరఫరా పనులు నత్తనడకన నడిచాయని, అవన్నీ క్లియరెన్స్ లు సాధించి మంచినీటి వసతి ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం క్షణం పాటు కరెంట్ పోని పరిస్థితిలో ఉన్నామని, హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్‌గా మార్చుకున్నామని, హైదరాబాద్ నగరం పవర్ సె క్టార్‌తో అనుసంధానం అయ్యిందని ఆయన తెలిపారు.
అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ ఫ్రీ
ప్రస్తుతం గొప్ప గొప్ప పరిశ్రమలు హైదరాబాద్‌లో కొలువుదీరుతున్నాయని, పరిశ్రమల రంగంలో ముందుకు దూసుకుపోతున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ కష్టాలు తీర్చుకుంటున్నామన్నారు. ఆఫీస్ స్పేస్, రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలు సడలించడంతో నిర్మాణం రంగం పుంజుకుందని ఆయన తెలిపారు. నేడు హైదరాబాదుకు 500 గొప్ప గొప్ప పరిశ్రమలు వచ్చాయని వేలాది మందికి ఉపాధి దొరికిందని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని, రెండో రన్ వే కూడా వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ విధంగా ఈ మెట్రో రైలు కనెక్టివీటి ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నగర ఎమ్మెల్యేలు, మంత్రులు, ముందుకు..
పేదల ఆధీనంలో ఉన్న భూములకు వెసులుబాటు ఇ వ్వాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సిఎం కెసిఆర్‌ను కోరా రు. ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని ఆయన తెలిపా రు. నగర ఎమ్మెల్యే లు, మంత్రులు, ముందుకు పురోగమిస్తున్నారని కెసిఆర్ పేర్కొన్నారు. మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో మరిన్ని విజయాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అద్భుతమైన నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎం తైనా ఖర్చు చేస్తుందని, వెనుకాడదనీ ఆయన తెలిపారు. ప్రపంచలోనే ఒక అద్భుతమైన నగరంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఉన్న హైదరాబాద్ ను మరింత అందంగా తీర్చుదిద్దుతామని కెసిఆర్ తెలిపారు.
పచ్చదనంలో మనం పురోగమించామని వరల్ గ్రీన్ సిటీ బెస్ట్ అవార్డు మనకే రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇంకా ఎన్నో అవార్డులు హైదరాబాద్ సొంతమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఫతుల్లాగూడలో నిర్మించిన స్మశాన వాటిక అద్భుతంగా ఉందని చెప్తే గర్వపడ్డానని, మనం ఎంత చేసినా ఇంకా తక్కువేనని ఆయన తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రు లు కెటిఆర్, తలసాని యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఎయిరో డైనమిక్ టెక్నాలజీ వినియోగం
మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 31 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 26 నిమిషాల్లో ప్రయాణించేలా హైదరాబాద్ మెట్రో రైల్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెట్రో నిర్మాణాన్ని చేపట్టింది. ఈ మెట్రో మార్గంలో పిల్లర్లతోపాటు రెండున్నర కిలోమీటర్ల మేర భూగర్భంలో రైలు మార్గాన్ని కూడా నిర్మించనుంది. ఔటర్ రింగ్‌రోడ్డు వెంట నిర్మించే ఈ మెట్రో మార్గంలో 120 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఎయిరో డైనమిక్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ప్రస్తుత మెట్రో స్టేషన్ల కంటే ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్లు క్లోజ్డ్ స ర్క్యూట్‌తో ఉంటాయి. రైలు వచ్చినప్పుడే ప్లాట్‌ఫాం గేట్లు తెరుచుకొంటాయి. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వ రకు 9 స్టేషన్లు ఉంటాయి. కార్గో లైన్, ప్యాసింజర్ లైన్ వేర్వేరుగా ఉంటాయి. మూడేళ్లకాలంలో ఈ ఎయిర్‌పో ర్టు మెట్రో కారిడార్ నిర్మాణ ప్రాజెక్టును పూర్తి చేస్తారు.
మెట్రోలో అధునాతన సౌకర్యాలు
తేలికపాటి స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం కోచ్‌లు ఇప్పుడున్న మెట్రో కంటే విమానాశ్రయ మెట్రోలో ప్రయాణికుల కోసం మరింత అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఎక్కువ మంది కూర్చొని ప్రయాణించేలా సీట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్లాట్‌ఫాంపై భద్రత కోసం అద్దాలతో కూడిన స్క్రీన్ విండోస్ ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్‌లో మెట్రోరైలు ఆగిన తర్వాత కోచ్ తలుపులు తెరచుకునే సమయంలోనే ఇవి తెరచుకుంటాయి. రైళ్లు వేగంగా వెళ్లేందుకు వీలుగా ఏరో డైనమిక్స్‌లో మార్పు చేస్తారు. తేలికపాటి స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం కోచ్‌లు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News