Friday, March 29, 2024

చైనాలో కరోనా మరణమృదంగం.

- Advertisement -
- Advertisement -

చైనాలో కరోనా మరణమృదంగం
శ్మశానవాటికల్లో శవాలతో బాధిత కుటుంబాల క్యూలు
248 మిలియన్ ప్రజలకు సోకిన మహమ్మారి
బీజింగ్: చైనాలో కరోనా స్వైరవిహారం చేస్తోంది. కొవిడ్ ధాటికి ప్రాణాలుకోల్పోతున్న వారిసంఖ్య రోజురోజుకి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. శవాలతో దహనవాటికలు కిక్కిరిసిపోతున్నాయి. మృతదేహాలతో బాధిత కుటుంబాలు బారులు తీరుతున్నారు. ఈ మేరకు హృదయ విదారక దృశ్యాలు నమోదైన వీడియోను ఆరోగ్య నిపుణుడు ఫెజిల్ డింగ్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. మృతదేహాల దహన సంస్కారాలకు కొన్ని గంటల సమయం పడుతుంది. కొవిడ్ 19 చైనాలో విరుచుకుపడుతుండటంతో ఆసుపత్రుల్లో మిలియన్ల పేషెంట్లు చేరుతున్నారు.

మరోవైపు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలు చైనా దేశవ్యాప్తంగా వద్ద పొడవాటి క్యూ కడుతుండటం దుర్భర స్థితికి అద్దం పడుతోంది. హెల్త్ ఎక్స్‌పర్ట్ ట్విట్టర్‌లో షేరు చేసిన వీడియో వీక్షకుల హృదయాలను కలిచివేస్తోంది. చైనాలోని ప్రభుత్వ మీడియా కూడా నిర్దిష్ట టెలివిజన్ కార్యక్రమాలను నిర్వహించలేకపోతుంది. సగానికిపైగా సిబ్బంది బారిన పడటమే దీనికి కారణమని ఎరిక్ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీని విరమించుకుంది. దీంతో కరోనా వైరస్ చైనా దేశవ్యాప్తంగా శరవేగంతో విస్తరించింది. బాధితులు కుప్పలుతెప్పలుగా నమోదవుతుండటంతో పరిస్థితి విషమంగా మారింది.

బాధిత కుటుంబ సభ్యులు శవాలతో బారులు తీరి గంటలపాటు దహన సంస్కారాల కోసం వేచి చూస్తున్నారు. డిసెంబర్ 1నుంచి మరోసారి కరోనా మహమ్మారి విజృంభించడంతో వైరస్ బారినపడిన అనేకమంది మృత్యువాత పడుతున్నారు. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఉద్దేశపూర్వకంగా లీక్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 248 మిలియన్ మంది ప్రజలు కొవిడ్ బారినపడ్డారు. చైనా దేశ జనాభాలో 17.56 శాతంగా పేర్కొన్నారు. డిసెంబర్ 1నుంచి 20వ తేదీ మధ్య కరోనా బాధితులుగా మారారని కేంద్రంగా ఉన్న దక్షిణ చైనా మార్నింగ్‌పోస్టు నివేదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News