Thursday, October 10, 2024

ఢిల్లీ కొత్త సిఎంగా అతిషి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర మంత్రి అతిషిని ఢిల్లీ కొత్త సిఎంగా కేజ్రీవాల్ ప్రకటించారు. సిఎంగా ఆతిషి బాధ్యతలు చేపడతారని ఆయన వెల్లడించారు. సిఎంగా ఎవరిని నియమించాలని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో కేజ్రీవాల్ చర్చించారు. అనంతరం శాసనసభా పక్ష సమావేశంలో మంత్రి అతిషి పేరును ప్రతిపాదించారు కేజ్రీవాల్.ఈ ప్రతిపాదనకు శాసనసభాపక్షం ఆమోదం తెలిపింది.

ఇక, మంగళవారం సాయంత్రం కేజ్రీవాల్ సిఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేయనున్నారు. కాగా, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. అయితే, బెయిల్ మంజూరు చేస్తూ.. సిఎం కార్యాలయానికి వెళ్లకూడదని, అధికారిక ఫైల్స్ పై సంతకం చేయకూడదని కేజ్రీవాల్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్ సిఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News