Sunday, October 6, 2024

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మంత్రి

- Advertisement -
నిర్మల్: బద్దం భోజ రెడ్డి 1000 మందికి స్టడీ మెటీరియల్ ను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పట్టణం సోఫీ నగర్ తెలంగాణ గురుకుల పాఠశాలలో బద్దం భోజా రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కెజిబివి విద్యాలయ పదవ తరగతి చదువుతున్న 1000 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. మే 11 నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని అధిక మార్కులు సాధించాలని కోరారు. చదువుల తల్లి బాసర సరస్వతి దేవి ఉన్న నిర్మల్ జిల్లా విద్యార్థులు చదువులో రాణించి జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతీ ఒక్క విద్యార్థి బాగా చదవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెజిబివి విద్యాలయాలు ఏర్పాటు చేశారని కొనియాడారు. సొన్ లో కెజిబివి విద్యాలయం మొన్ననే ప్రారంభించామన్నారు. ఈ నెల 16న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులు మంత్రితో కేక్ కట్ చేయించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News