Saturday, April 20, 2024

నిర్మల్‌లో 250 పడకల ఆస్పత్రికి మంత్రులు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -
Minister Harish Laying Foundation to 250 Bedded Hospital
జిల్లాలో రూ 59.76 కోట్లతో ఆసుపత్రుల నిర్మాణం – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు

నిర్మల్: నిర్మల్ జిల్లాలో నూతన ఆస్పత్రుల భవన నిర్మాణం మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం 59.76 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రం లోని మల్లన్నగుట్ట వద్ద 39.96 కోట్లతో నిర్మించనున్న 250 పడకల జిల్లా ఆసుపత్రి భవనానికి, ముథోల్లో రూపాయలు 8 కోట్ల వ్యయంతో 30 పడకల ఆసుపత్రి భవనానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ఆస్పత్రి నిర్వహణకు రూ లు 1.15 కోట్లు కేటాయించిందని అన్నారు. మంత్రి హరీష్ రావ్, ఇంద్రకరణ్ రెడ్డి గురువారం బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాసరలోని శివాజీ చౌక్లో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ముథోల్ లో నూతనంగా నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుండి నర్సాపూర్ జి లోని 30 పడకల ఆస్పత్రిని సందర్శించారు. ఇటీవల ప్రభుత్వం రూ.లు 3.50 కోట్లు వెచ్చించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్న ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. మంత్రులు హరీష్ రావ్, ఇంద్రకరణ్ రెడ్డి లను నర్సాపూర్ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిర్మల్ జిల్లా ఆస్పత్రిని సందర్శించి 75 లక్షల వ్యయంతో నిర్మించనున్న రేడియాలజీ ల్యాబ్ నకు మంత్రులు శంకుస్థాపన చేశారు. 9.90 లక్షల వ్యయంతో నిర్మించిన పోలియేటివ్ కేర్ వార్డు మంత్రి హరీష్ రావ్ ప్రారంభించారు. వైద్య పరికరాలు ఆస్పత్రి నిర్వహణ, సిబ్బంది వేతనాలు, ఇతరత్రా అవసరాల కోసం ప్రభుత్వం రూ. లు 9 కోట్లు కేటాయించింది. ప్రసూతి ఆసుపత్రిని సందర్శించి మంత్రి వార్డులో ఉన్న బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ ప్రవీణ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొర్పెల్లి విజయలక్ష్మి రాంకిషన్రెడ్డి, ఎంఎల్ఏ లు విఠల్రెడ్డి, రేఖానాయక్, ఎం ఎల్ సి దండె విఠల్, రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాల చారి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మద ముత్యంరెడ్డి, ఎఫ్ ఎఫ్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, రైతు సమాన్వయ సమితి అధ్యక్షులు వెంకట్ట్రాంరెడ్డి డిఎం అండ్ హెచ్ఓ ధన్ రాజ్, ఆస్పత్రి సూపరింటిండెంట్ దేవేందర్ రెడ్డి,రజని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News