Friday, February 3, 2023

కేంద్రానికి దశా దిశా లేదు: మంత్రి హరీశ్

- Advertisement -

minister harish rao fires on bjp government

కేంద్రానికి దశాదిశా లేదు. మీ నిర్ణయాలు రైతులకు శాపం
తల తోక లేని నిర్ణయాల వల్ల రైతుల ఇబ్బంది పడుతున్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణ మారింది.
బియ్యం నూకలు ఎగుమతి పై ఎందుకు నిషేధం విధించారు
ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఫైర్

హైదరాబాద్: కేంద్రానికి దశా దిశా లేదు. కేంద్రం నిర్ణయాలు రైతులకు శాపంగా మారాయని మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హరీశ్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ…  ఈ మార్కెట్ కమిటీకి పెద్ద హిస్టరీ ఉంది. ఎమ్మెల్యే కోరగానే సీఎం విలువైన 15 ఎకరాలు ఇచ్చారు. అతి త్వరలో సంగారెడ్డి వైద్య కళాశాల, పటాన్ చెరులో 300 పడకల ఆసుపత్రి కోసం శంకుస్థాపన చేస్తారు. బారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుందాం. సీఎం కేసీఆర్ గారు గత పర్యటనలో ఎంతో ప్రకటించారు. పత్రికల్లో చూశాము.. కేంద్రం నూకలు ఎగుమతి మీద నిషేదం పెట్టింది. వరి ధాన్యం మీద నిషేధం పెట్టింది. ఎందుకు.? అని ప్రశ్నించారు. వరి వద్దు అన్నారు. కేంద్రం కొనది అన్నారు. మేము కష్టపడి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి పంట పండించాము. దక్షిణ భారతకు తెలంగాణ ధాన్యాగారం అయ్యిందని మంత్రి పేర్కొన్నారు.

వడ్లు కొనమని సీఎం కేసీఆర్ ఢిల్లీ లో ధర్నా చేశారు. నాలుగేళ్లు నిల్వ ఉంటే ఎందుకు నిషేధం పెడుతున్నారని మండిపడ్డారు. మీకు తల, తోక లేదు. దశ దిశ లేదన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి డిల్లీ వెళ్లి అడిగితే, మీరే నూకలు తినాలి అని అవమానించారని గుర్తు చేశారు. ఇప్పుడు నూకలు ఇతర దేశాలకు అయినా పంపాలి అంటే, ఇప్పుడు నిషేధం పెడుతున్నారు. దేశంలో ఆహారం నిల్వలు తగ్గినప్పుడు నిషేధం పెడుతారు. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు. దేశ ఆహార భద్రతకు భరోసా లేకుండా చేస్తున్నారని కేంద్రంపై ఫైర్ అయ్యారు. కేంద్రం అసంబద్ధ నిర్ణయాలు. దీని వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మీ పరిపాలన రైతులకు శాపంగా మారింది. రైతుల ఆదాయం రెట్టింపు అన్నారు ఏమైందీ. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. సగం దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని తెలిపారు. ఉమ్మడి 23 జిల్లాలో 72లక్షల ఎకరాల్లో వరి పండితే, ఇప్పుడు 10 జిల్లాలో 65 లక్షల ఎకరాల్లో వరి పండిందన్నారు. సీఎం కేసీఆర్ ఆకుపచ్చ తెలంగాణ గా రాష్ట్రాన్ని మార్చారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles