Monday, February 26, 2024

అధికారం అప్పగిస్తే దేశాన్ని ప్రమాదంలో పడేశారు

- Advertisement -
- Advertisement -

Minister Jagadish reddy comments on central govt

వాట్సప్ యూనివర్శిటీ కేంద్రంగా అసత్య ప్రచారం
గుజరాత్ నమూనాతో బిజెపి నయవంచన
తెలంగాణ గొంతు నులిమేందుకు కేంద్రం కుట్రలు
దేశ ప్రజలు తెలంగాణ మోడల్ కోరుకుంటున్నారు
రెడ్కో చైర్మన్ గా సతీష్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రులు

హైదరాబాద్ : డబుల్ ఇంజన్లతో కేంద్రం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తోకందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువులాంటిదని, అటువంటి పసిగుడ్డను గొంతు నులిమేందుకు మోడి సర్కార్ కుట్రలు పన్నుతోందని ఆయన దుయ్యబట్టారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో శుక్రవారం రెడ్కో చైర్మన్‌గా సతీష్ రెరడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసన మండలి సభ్యులు టి.రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు, తాత మధు, శాసనసభ్యులు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, ఆరూరి రమేష్, కార్పొరేషన్ చైర్మన్లు డి. బాలరాజు యాదవ్, వాసుదేవ రెడ్డి, గజ్జెల నగేష్, దామోదర్, రెడ్కో విసి, ఎండి డి. వి. జానయ్య, జనరల్ మేనేజర్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ వాట్సప్ యూనివర్శిటీల కేంద్రంగా బిజెపి అసత్య ప్రచారాలకు దిగుతోందని దుయ్యబట్టారు.

అటువంటి అసత్యాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గుజరాత్ నమూన చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి అదే గుజరాత్‌ను ఇప్పుడు చీకట్లో కి నెట్టేసిందన్నారు. వ్యవసాయానికి ఆరు గంటలు కూడా కంరెంటు ఇవ్వక పోగా పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించిన అంశాన్ని మంత్రి గుర్తు చేశారు. యావద్ధేశంలో చీకట్లు అలుముకున్న రోజున ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో వెలుగులు నింపిందన్నారు. అటువంటి నాయకుడి నేతృత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు. రెడ్కో చైర్మన్‌గా సతీష్ రెడ్డి నియామకం అందులో భాగంగానే జరిగిందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. శుత్రుదుర్బేధ్యమైన కోటగా టిఆర్‌ఎస్ రూపుదిద్దుకుందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మాణాత్మక పార్టీగా ప్రజల నుండి అనూహ్య ఆదరణ టిఆర్‌ఎస్‌కు లభిస్తోందని చెప్పారు.

సభ్యత్వ నమోదు కోసం ప్రజలు బారులు తీరడమే ఇందుకు అద్దం పడుతోందన్నారు. బిజెపి గుజరాత్ మోడల్ ను త్రీడీలో చూపించి దేశ ప్రజలను మోసం చేసిందని గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఇప్పుడు దేశ ప్రజలు తెలంగాణ మోడల్ కోరుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్యమకారులకు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. ఉద్యమ కాలం నుండి పనిచేస్తున్న వ్యక్తులను గుర్తించి వారికి మంచి అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఏ పదవి ఆశించకుండా సమర్థవంతంగా పనిచేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందన్నారు. కేంద్రంలోని మోడి ప్రభుత్వం దేశాన్ని చీకట్లో నెడ్తోందని, ఆ ప్రభుత్వాన్ని ప్రజలు బుద్దిచెబుతారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News