Thursday, July 31, 2025

రంగ సముద్రం జలాశయాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: వనపర్తి జిల్లా శ్రీ రంగాపూర్ మండలంలోని రంగ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు సాగునీరు అందించే భీమా కెనాల్‌కు నీటిని విడుదల చేయడం లేదని రైతులు మంత్రి జూపల్లికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి బుధవారం రంగ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటి విడుదలకు జాప్యం చేసిన సాగునీటి అధికారులపై మంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రిజర్వాయర్‌లో నీళ్లు ఉన్నప్పటికి సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటిని ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు.

భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని, రోజు వారిగా ఎంత నీటిని విడుదల చేస్తున్నారో దాని లాగ్ బుక్‌లో నమోదు చేయాలన్నారు. మంత్రి వెంట ఎస్‌ఈ శ్రీనివాస్ రెడ్డి, ఇఇ కేశవ రావు, డిఈలు కిరణ్ కుమార్, రాజ్ కుమార్, ఐఇఇ వినయ్ కుమార్, ఏఇ అక్షయ్ కుమార్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News