Monday, May 27, 2024

పునాదులు కూడా ఉండవు

- Advertisement -
- Advertisement -
కాంగ్రెస్‌ను టచ్ చేస్తే
బిఆర్‌ఎస్ పతనం ఖాయం
బిడ్డా కెసిఆర్.. నిన్ను,
నీ పార్టీని రాజకీయంగా
బొంద పెడతాం మేం
తలచుకుంటే 30 మంది
‘కారు’ ఎంఎల్‌ఎలు ఎప్పుడో
మా పార్టీలో చేరేవారు
జూన్ 5 నుంచి ప్రభుత్వ
పాలనపై దృష్టి పెడతాం
కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు
జైలుకు వెళ్ళడం ఖాయం-
కూతురి అరెస్టుతో
మతిభ్రమించి మాట్లాడుతున్న
మాజీ సిఎం రోడ్లు,
భవనాలు, సినిమాటోగ్రఫీ
శాఖల మంత్రి కోమటిరెడ్డి
వెంకటరెడ్డి

మన తెలంగాణ / నల్లగొండ ప్రతినిధి : ‘బిడ్డా.. కెసిఆర్.. నిన్ను.. నీ పార్టీని మూడు నెలల్లో రాజకీయంగా బొంద పె డతాం’ అని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘కెసిఆర్.. మా పార్టీని టచ్ చేసి చూడు.. మా పార్టీ వీర సైనికులే నీ పార్టీని పునాదులు లేకుండా చేస్తారు. గుర్తుపెట్టుకో బిడా’..అంటూ హెచ్చరించారు. ‘గత కొద్ది రోజులుగా నీ కొడుకు కెటిఆర్ ఇలాంటి మాటలే మాట్లాడుతుంటే.. బచ్చాగాడు.. రాజకీయాలు తెలియవు పోనీలే.. అని ఊరుకుంటున్నాం.. ఇప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని మాట్లాడడం నీ మూర్ఖత్వానికి అద్దం పడుతోంది’ అని ధ్వజమెత్తారు.

‘మేం తలచుకుంటే బిఆర్‌ఎస్‌కు చెందిన 30 మంది ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లో ఎప్పుడో చేరేవారు’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి 13 నుంచి 14 ఎంపి సీట్లు రావడం ఖాయమని, జూన్ 5 తారీఖు నుంచి ప్రభుత్వ పాలనపై దృష్టి పెడతామని ఆయన స్పష్టం చేశారు. ‘రేవంత్ రెడ్డి కష్టపడి సిఎం అయ్యారు.. రేవంత్ రెడ్డికి.. నీకు పోలికా’ అంటూ ఎద్దేవా చేశారు. ‘రేవంత్ రెడ్డికి మొఖం చూపించలేక రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒక్కసారి కూడా రాలేదు. ‘నువ్వు.. నీ కొడుకు, నీ అల్లుడు తీహార్ జైలుకు వెళ్లడం ఖాయం’ అన్నారు. కూతురు కవిత అరెస్ట్‌తో కెసిఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కవిత జైలుకు పోయినా మాజీ సిఎంకు బుద్ధి రాలేదన్నారు. అవినీతి చేసిన ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క ఎంపి సీటు కూడా బిఆర్‌ఎస్‌కు రాదని వ్యాఖ్యానించారు. రెండు లక్షల రుణ మాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News