Tuesday, April 30, 2024

ప్రతిపక్షాలకు ఓట్లడిగే హక్కు లేదు: మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

రాయికల్‌ః దేశభక్తి అనే ముసుగులో లేనోళ్లను కొట్టి ఉన్నోళ్లుకు దోచిపెడుతూ దేశాన్ని ఆగం చేస్తుండ్రని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బిజెపి పాలనపై మండిపడ్డారు. రాయికల్ శివాజీ రెడ్డి గార్డెన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని చెప్పారు. రైతులు, మహిళలు, దళితులు, యాదవులు, గంగపుత్రులు ఇలా అన్ని వర్గాల అభివృద్దికి చేయూతనిస్తున్న తమ సిఎం కెసిఆర్ అభివృద్ది, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని వివరించారు.

తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు అనేక విధాలుగా తపిస్తున్న సిఎం కెసిఆర్‌కు ప్రజలు అండగా ఉండాలని కోరారు. తెలంగాణలో ఇంత అభివృద్ది జరుగుతుందని దేశంలో ఏ రాష్ట్రంలో జరగడం లేదని చెప్పుతూ తెలంగాణ సర్కార్‌ను బద్నాం చేసే విధంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మండి పడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రతి పక్షాలకు ఒట్లడిగే నైతిక హక్కు లేదని అన్నారు. ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తారని ప్రశ్నించారు. తమ పార్టీకి కార్యకర్తలే పెద్ద బలమని ఆ బలాన్ని ఎవరు ఆపలేరని తెలిపారు.  ప్రజలకు ప్రభుత్వానికి వారధి పార్టీ కార్యకర్తలేనని చెప్పారు. కష్టపడి పని చేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని ఎవరు ఆదైర్యపడవద్దని సూచించారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేదల నడ్డివిరుస్తు పెద్దలకు దోచి పెడుతుందన్నారు. బ్యాంకులకు 12లక్షల కోట్లు అప్పు చేసి పారిపోయిన బడా వ్యాపారుల అప్పులను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఆదాని షేర్ల నష్టం వల్ల ఎల్‌ఐసి పెట్టుబడి పెట్టి వేల కోట్ల ఆస్తి ఆవిరి చేసారని దుయ్యబట్టారు. అభివృద్ది పథకాల్లో కేంద్రం వాటా ఉంటే తాము పాలిస్తున్న బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ అభివృద్ది పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. హిందు ముస్లీంల మధ్య చిచ్చు పెట్టి రాజీకయ పబ్బం గడుపుకునే బిజెపికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో మాత్రమే తెలంగాణ సర్కార్‌పై విమర్శలు చేస్తుందని విమర్శించారు. 40 ఏళ్లు పాలన సాగించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిన అభివృద్ది ఏంటని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News