Monday, December 4, 2023

వెన్నెముక లేని రాష్ట్ర బిజెపి

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో ఉన్నది ఎన్‌డిఎ కాదు ఎన్‌పిఎ

(నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ప్రభుత్వం)

తెలంగాణ రైతులకు కృష్ణ జలాల్లో సరైన వాటా
అందించలేనందుకు సిగ్గుపడాలి : ట్విట్టర్‌లో మంత్రి ఆగ్రహం ట్వీట్‌కు అనుకూలంగా తీవ్రంగా
స్పందించిన రాష్ట్ర నేతలు, నెటిజన్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కెటిఆర్ మరోసారి మండిపడ్డారు. కృష్ణా నదీజాలల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారు. నదీ జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, లేదంటే ఇప్పుడున్న ట్రి బ్యునల్-2కి సంబంధించిన నిబంధనలను సవరించాలనే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ తిరస్కరించడం పై ట్విట్టర్ వేదికగా ఘాటుగానే స్పందించారు. ‘ఎనిమిదేళ్లు గడుస్తు న్నా.. తెలంగాణ రైతులకు కృష్ణా జలాల్లో సరైన వాటా అందించలేని ఎన్‌పీఏ (నాన్ పర్ఫార్మింగ్ అసెట్) ప్రభుత్వానికి సిగ్గుండాలి. రాష్ట్ర ప్ర యోజనాల విషయంలో రాజీపడే రా జకీయాలు చేయకూడదు. వెన్నెముక లేని టీఎస్ బిజెపి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుం దా..లేదా?’ అంటూ కెటిఆర్ ప్రశ్నించారు.

కేటీఆర్ ట్వీట్‌పై రాష్ట్ర నేతలు, నెటిజన్లు స్పందించారు. ’తెలంగాణ విషయంలో భారత ప్రభుత్వానికి ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు..? వాళ్లు చేసిన వాగ్ధానాల అమలులో ఎప్పుడో విఫలమయ్యారని, అర్థం లేని మాటలు మాట్లాడే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఇలాం టి విషయాలను మాట్లాడే దమ్ము ఎందుకు మండిపడ్డారు. సిగ్గులేని బీజీపీ.. దమ్ములేని నాయకులు సమస్యలపై మా ట్లాడని బిజెపి రాష్ట్రానికి పట్టిన శని’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News