Friday, April 26, 2024

నేతలుమారేదెప్పుడు?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, నేతల దృష్టంతా ఎప్పుడు రాజకీయాలపైనే ఉంటోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధిక రంగంపైనగానీ, భవిష్యత్ తరాల గురించి ఎప్పుడు ఆలోచన చేస్తున్నట్లు గా కనిపించడం లేదన్నారు. భారత దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదేనని వ్యాఖ్యానించారు. ఇది ఏ ఒక్కరికో… ఒక రాజకీయ పార్టీ కో ఆపాదించడం లేదన్నారు. ఇందుకు తాను కూడా మినహాయింపు కాదన్నారు. గురువారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో ఎన్‌హెచ్‌ఆర్‌డి నిర్వహించిన ‘డికోడ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కెటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీ య నాయకులు తమ స్వలాభం , వారి రాజకీయ భవిష్యత్ కోసమే ఆలోచిస్తున్నారే తప్పా…. దేశ అభ్యున్నతి కోసం ఏ మాత్రం ఆలోచించడంలేదన్నారు.

దేశాన్ని పాలించే నాయకులు ఒక విజన్ తో పని చేసినప్పుడే అభివృద్దికి అడుగులు పడతాయన్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తుంటే….అసలు దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లుగా ఎక్కడా కనపడ లేదన్నారు. ఇది ప్రజల సంక్షేమానికి ఏమైనా ఉపయోగపడుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతున్న భారతదేశానికి కా వాల్సిన బడ్జెట్ ఇదేనా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. పాలకుల్లో దేశం పట్ల అంకిత భావం ఎందుకు నిశిస్తున్నదో తనకైతే అర్థం కావడం లేదన్నారు. కేవలం ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆవేదన వక్తం చేశారు. మన దేశంలో పుష్కలంగా వనరులు ఉన్నప్పటికీ అనేక దేశాల కంటే వెనుకబడి ఉండడం సిగ్గుచేటని కెటిఆర్ వ్యాఖ్యానించారు. చైనా, జపాన్ వంటి దేశాలు అభివృద్ధిలో పరుగులు తీస్తుం టే.. భారత్ మాత్రం ఆ దేశాల ముందు తేలిపోతోందన్నా రు.

ఇక సింగపూర్ విస్తీర్ణంలో హైదరాబాద్ కంటే చిన్నగా ఉంటుందని… అయినా అభివృద్ధిలో మాత్రం వేగంగా ముందుకెళ్తున్నదన్నారు. ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తేనే భారత్ నంబర్ వన్‌గా ఎదుగుతుందన్నారు. ప్రపంచంలో గుర్తించదగిన సాం సంగ్, బిఎండబ్ల్యూ, ఎల్‌జి వంటి బ్రాండ్స్ ఎందు కు మన దేశం నుండి రావడం లేదని కెటిఆర్ ప్రశ్నించారు. కాగా దేశం మొత్తం జనాభాలో 60శాతం మంది యువతేనని, అయినా దేశంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందన్నారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఇప్పటికీ పాలకులు ఆలోచన చేయకపోవడం శోచనీయమని పరోక్షంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అభివృద్ధిలో రాష్ట్రం దూసుకపోతుంటే…
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకపోతుం టే… కేంద్రం మాత్రం వెనుకపడి పోతోందని కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన గత ఎనిమిది సంవత్సరాల్లోనే అభివృద్ధిలో తెలంగా ణ అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. దేశ జిడిపిలో 5 శాతం వాటా తెలంగాణదే అని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రధానంగా త్రి ‘ఐ’ మంత్రతో రాష్ట్రం ముం దుకెళ్తుందన్నారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజిన్ గ్రోత్‌కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలను సాధించగలిగామన్నారు. ఇక ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా టిఎస్‌ఐపాస్ ద్వారా పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని రకాల అనుమతిస్తున్నామన్నారు.

15 రో జులు దాటితే సంబంధిత అధికారి నుంచి రో జుకు రూ.వెయ్యి చొప్పున పెనాల్టీ వసూలు చేస్తున్నామన్నారు. గత 75 ఏండ్లలో ఏ ప్రభుత్వం ఇ లాంటి కార్యక్రమాలను చేపట్టలేదన్నారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిచెందిన సంస్థల తమ రెండో అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు.
వ్యాక్సిన్‌లకు ప్రపంచ రాజధానిగా హైదరాబాద్
ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ వెలుగొందుతున్నదని కెటిఆర్ తెలిపారు. 1/3వ వంతు వ్యాక్సిన్లు ఇక్కడే తయారవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఐటి, అగ్రికల్చర్ గ్రోత్ ప్రతిఏడాది పెరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను నాలుగేండ్లలోనే పూర్తిచేశామన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకెళ్తున్నదని చెప్పారు. దేశంలో 24 గంటల పాటు వాటర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి వాటర్ సదుపాయం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News