Sunday, June 16, 2024

జంగిల్ సఫారీని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కెసిఆర్ అర్బన్ ఎకో పార్కులో రూ.2.70 కోట్లతో నిర్మించనున్న బర్డ్స్ ఎన్ క్లోజర్ ను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం 26 వేల ఎకరాల్లో దేశంలోనే పెద్ద జంగిల్ సఫారీని, నూతనంగా సిద్ధం చేసిన డిస్కవరీ ఛానల్ తరహా రెండు సఫారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సఫారీ వాహనంలో వాచ్ టవర్ వరకు ప్రయాణించారు. వాచ్ టవర్ చేరుకుని పైకి ఎక్కి అడవిని తిలకించారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు…. ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ పార్కులో… గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడుతున్న ప్రకృతి ప్రేమికుడు ఎంపీ సంతోష్ చేతుల మీదుగా జంగిల్ సఫారీని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చేలా జంగిల్ సఫారీని తీర్చిదిద్దుతామన్నారు.

ప్లాస్టిక్ ఫ్రీ ఫారెస్ట్ గా కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్
– ఎంపీ సంతోష్ కుమార్

అతిపెద్ద అర్బన్ ఎకో పార్కులో 1.5 ఎకరాల్లో వేలాది పక్షులతో బర్డ్స్ ఎన్ క్లోజర్ ను ప్రారంభించడం సంతోషమని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. అర్బన్ ఎకో పార్కును ప్లాస్టిక్ ఫ్రీ పార్కుగా తీర్చిదిద్దుదాని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. దేశంలోని ఏ ఇతర ఫారెస్ట్ కు తీసిపోని విధంగా కెసిఆర్ అర్బన్ ఎకో పార్కు ఉందన్నారు. ప్రభుత్వం తరఫున, తన తరపున అడవి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని ఎంపీ తెలిపారు. తర్వాత తిరిగి సఫారీ వాహనంలోనే అడవిలో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, మాజీ మార్కెట్ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News