Wednesday, May 1, 2024

ఇది కెసిఆర్ తెచ్చిన కరువు.. బ్యారేజీల్లో నీటిని నింపే అవకాశమే లేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రాన్ని అమ్మింది ఎవరు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుపోతుంటే కెసిఆర్ ఏం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ మంత్రుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కెసిఆర్ పాలనలోనే కృష్ణ జలాలు ఎపికి ఎక్కువ తీసుకెళ్లారు. కృష్ణ జలాలను ఎపికి అక్రమంగా కెసిఆర్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. ప్రజలు బిఆర్ఎస్ ను బొందపెట్టడానికి సిద్ధమయ్యారని తెలిపారు. రూ. 90 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టలేకపోయారని ఆరోపించారు. కెసిఆర్ చేసిన దోపిడీకి వేరే దేశాల్లో ఉరిశిక్ష వేస్తారన్నారు. ఇది కెసిఆర్ తీసుకొచ్చిన కరువు.. ఉన్న నీటిని రైతులకు ఏ విధంగా ఉపయోగించాలో వారం వారం సమీక్షిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కరెంట్ విషయంలో కెసిఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ ఎందుకు మార్చారని ఉత్తమ్ ప్రశ్నించారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల డిజైన్లు మార్చారన్నారు. రైతుల ఇబ్బందులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మానేరు నది మీ పాలనలో జలధారగా మారిందంటే ప్రజలు నవ్వుతారని పేర్కొన్నారు. ఈ ఏడాది శ్రీరామ్ సాగర్ లో నీళ్లు లేవు.. వరద కాలువలు ఎండిపోవడానికి కారణం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కెసిఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని ఉత్తమ్ వెల్లడించారు. నిపుణుల అభిప్రాయం మేరకే ప్రాజెక్టులపై ముందుకు వెళ్తామన్నారు. బ్యారేజీల్లో నీటిని నింపే అవకాశమే లేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News