Saturday, April 27, 2024

గవర్నర్ పై గరంగరం

- Advertisement -
- Advertisement -

తమిళిసై తీరుపై నిప్పులు చెరిగిన మంత్రులు

మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ గారు.. ఇదేం పద్ధతి..? అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల ఎంఎల్‌సి అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌం దర రాజన్ నిర్ణయించడం దారుణమ న్నారు. సమాజంలోని అత్యం త వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని తెలిపారు. వారు తమ తమ రంగాల్లో ప్రజలకు మేలుచేసే అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారన్నారు. అలాంటి వారిని తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కో టాలో ఎంఎల్‌సిలుగా అవకాశం కల్పిస్తే గవర్నర్ వారిద్దరు బిఆర్‌ఎస్ పార్టీలో సభ్యులుగా ఉండడం వల్ల అనర్హులనడం దారుణమని, ఒకవేళ ఇదే అయితే తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారు..? పార్టీ అధ్యక్షురాలిగా ఉ న్న వ్యక్తికి రాష్ట్ర గవర్నర్‌గా ఇవ్వవచ్చా..? సర్కారియా కమిషన్ ప్రతిపాదనలను బట్టి చూస్తే గవర్నర్ పదవిలో తమిళిసై ఉండవద్దు.. మరి ఆమె ఎలా ఉన్నారు.? అంతెందుకు. బిజెపి పార్టీకి చెందిన గులాం అ లీ ఖతానాను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపలేదా..? బీజేపీ నే త మహేశ్ జఠ్మలానీ, సోనాల్ మాన్‌సింగ్, రాంషఖల్, రాకేశ్ సిన్హా.. ఇలా వీళ్లంతా బిజెపిలో పనిచేయలేదా..? వీరిని ఎలా రాష్ట్రపతి కోటా లో రాజ్యసభ సభ్యులగా నియమించారు..? అని ప్రశ్నించారు. బిజెపి అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో జితిన్ ప్రసాద్, గోపాల్ అర్జున్ బూర్జీ, చౌదరీ వీరేంద్ర సింగ్, రజనీకాంత్ మహేశ్వరీ, సాకేత్ మిశ్రా, హన్స్‌రాజ్ విశ్వకర్మ ఇలా అనేక మందిని గవర్నర్ కోటాలో ఎంఎల్‌సి గా నియమించారన్నారు. వీరంతా బిజెపి పార్టీలో ప్రత్యక్షంగా ఉన్నవారే కదా..? అంటే బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధానం, బిజెపితో క లిసిలేని రాష్ట్రాల్లో మరో విధానం అమలు చేస్తా రా..? కేంద్ర ప్రభుత్వానికి ఒక నీతి, బిజెపియేతర రాష్ట్రాలకు మరోనీతి ఉంటుందా..? తెలంగాణ విషయంలో గవర్నర్ వైఖరిలో మార్పు లేదన్నారు. ని జంగా ప్రభుత్వం తప్పు చేస్తే గవర్నర్ సరిచేస్తే ఏ మో అనుకోవచ్చు కానీ, నీతి, నిజాయితీతో పనిచే స్తే కూడా గవర్నర్ కక్షపూరితంగా వ్యవహరించ డం సరికాదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేసిన బి ల్లులను ఆపారు. రెండేసిసార్లు బిల్లులను పంపినా వాటిని ఆమోదించలేదు. ఇప్పుడేమో ప్రభుత్వం ప్రతిపాదించిన గవర్నర్ కోటా ఎంఎల్‌సి అభ్యర్థిత్వాలను తిరస్కరించడం మరీ దారుణమన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారన్నారు.
తమిళిసై వెంటనే రాజీనామా చేయాలి : మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్ణయాన్ని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. రాజకీయ నేప థ్యం ఉందని ఇద్దరు పేర్లను తిరస్కరించడం అత్యం త దుర్మార్గం అన్న ఆయన ఎస్‌టి, ఎంబిసి సామాజిక వర్గాలను అగౌరవపరచినట్లేనని వ్యాఖ్యానించారు. గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నేపథ్యం ఉందని తెలంగాణ ఉద్యమకారులను తమిళిసై అవమానించార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారియా కమిషన్ సి ఫారసు ప్రకారం రాజకీయాలకు సంబంధం లేని వారిని గవర్నర్లుగా నియమించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ పలుమార్లు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. వాటిని తుంగలో తొక్కి ఒక రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిని గవర్నర్‌గా నియమించారని ఆక్షేపించారు. మంత్రిమండలి సిఫారసు చేసిన పేర్లను తిరస్కరించడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండించిన ప్రశాంత్ రెడ్డి.. తమిళిసైకి గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత లేదని వ్యాఖ్యానించారు. నైతిక విలువలు ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కిషన్ రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ తిరస్కరణ : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుట్ర వల్లే ఎంఎల్‌సిల ఫైల్‌ను గవర్నర్ తిరస్కరించారని రాష్ట్ర ఎక్సైజ్, ప ర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావ స్తు శాఖ మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్ విమర్శించా రు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన క్యాం పు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ ఎలాంటి సామాజిక సేవ చేయలేదంటూ వీరు రాజకీయ నాయకులని పేర్కొంటూ గవర్నర్ తిరస్కరించడం ఎంతవరకు సమంజసమని మంత్రి ప్రశ్నించారు. గవర్నర్ చర్య సమాఖ్య స్ఫూర్తికి విఘాతం అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు చెందిన వారిని అణచివేసే కుట్ర ఇ దని పేర్కొన్నారు. ప్రధాని బిసి అయినా బిసిలకు తీ రని అన్యాయం జరుగుతోందన్నారు. బిసిలను అ ణచివేసేందుకు బిజెపి ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నదన్నారు. బిజెపిలో ఉండి రాజకీయం చేస్తే మాత్రమే పవిత్రమా? ఇతర పార్టీల వారు రాజకీయాలు చేస్తే అపవిత్రం అయిపోతుందా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కక్షపూరితంగా తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల వా రిని ఎదగనీయకుండా కుట్ర చేస్తున్నారని అందుకే ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్రా సత్యనారాయణ, ఎంబిసి అయిన దాసోజు శ్రవణ్ ఎంఎల్‌సి అభ్యర్థిత్వాలను గవర్నర్‌కు చెప్పి నిలుపుదల చేయించారని విమర్శించారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం దేశంలో 58 శాతం ఉన్న బిసిల రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని, త్వరలో తెలంగాణ వస్తున్న ప్రధాని మోడీకి చెప్పి బిసి బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.
సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు : మంత్రి అల్లోల
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చర్య సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమె రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట ప్రభుత్వాన్ని ఇ బ్బంది పెడుతున్నారని, గతంలో ఏ గవర్నర్ ఇలా చేయలేదని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సరికాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News