Tuesday, November 12, 2024

యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం…. 10 మంది కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

మీర్జాపూర్(యుపి): కూలీలను తీసుకువెళుతున్న ఒక ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో 10 మంది మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మీర్జాపూర్ వారణాసి సరిహద్దులో కచ్చావన్, మీర్జామురద్ ప్రాంతాల మధ్య జిటి రోఉడ్డపై తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. భదోహి జిల్లాలో నిర్మాణం పనులు పూర్తి చేసుకుని 13 మంది కూలీలు ట్రాక్టర్ ట్రాలీలో తిరిగివస్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొందని మీర్జాపూర్ ఎస్‌పి అభినందన్ తెలిపారు. 10 మంది కూలీలు అక్కడికక్కడే మరణించగా గాయపడిన ముగ్గురిని ఐఐటి-బిహెచ్‌యు వద్ద ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. ప్రమాదంలో10 మంది కూలీలు మరణించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News