Wednesday, May 14, 2025

పాత బస్తీకి అందం

- Advertisement -
- Advertisement -

సాంప్రదాయ సంగీతంతో
మిస్ వరల్డ్ పోటీదారులకు
చార్మినార్ వద్ద ఘన స్వాగతం
వేదికపై నుంచి అందగత్తెల
అభివాదం వేడుకగా హెరిటేజ్
వాక్ లాడ్‌బజార్‌లో
సుందరాంగుల షాపింగ్ సందడి
హైదరాబాద్ చాయ్, బిస్కెట్
రుచి చూసి మైమరచిపోయిన
అందాలభామలు

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుందరాంగులతో పాత బస్తీ మెరిసిపోయిం ది. మిస్ వరల్డ్ 2025 పోటీదారుల సందర్శనతో హైదరాబాద్ చరిత్రకు నిలువెత్తు నిదర్శనమైన చార్మినార్ ఖ్యాతి ప్ర పంచం నలుమూలలకు చేరింది. చార్మినార్‌ను వీక్షించిన అందగత్తెలు అద్భుత కట్టడానికి ఫిదా అయిపోయారు. 109 దేశాల భామలకు అద్భుతమైన మధురానుభూతుల ను మిగిల్చింది. మంగళవారం చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, సందర్శనకు విచ్చేసిన వారితో ఆ ప్రాంతం కళకళలాడింది. ఐదు శతాబ్దాలుగా హైదరాబాద్ మధ్యన ఠీవిగా ని లబడి ఉన్న ఈ సొగసైన కట్టడాన్ని చూసి సుందరాంగులు మంత్రముగ్ధులయ్యారు.

ముందుగా సందర్శన కోసం చార్మినార్ వద్దకు పర్యాటక బస్సులతో చేరుకున్న మిస్ వరల్ కంటెస్టెంట్‌లకు అధికారులు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. స్థానిక కళాకారులు వారికి సంప్రదాయిక అ రబ్బీ మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలికారు. మార్ఫా శబ్దాలతో మమేకం చేస్తున్నట్లుగా కొందరు కంటెస్టెంట్స్ ప్రత్యేక స్టెప్పులతో నృత్యం చేసి, స్థానిక సంస్కృతికి అనుకూలంగా వారు అనునయించారు. ఈ అందాల రాయబారులతో చార్మినార్ పరిసరాలు ఒక సరికొత్త శోభను పొం దాయి. ప్రత్యేకంగా చార్మినార్ వద్ద ఫోటోషూట్ కు హాజరైన సుందరాంగులు ఈ చారిత్రాత్మిక వేదిక ను ండి ప్రజలకు అభివాదం చేస్తూ, తమ ఆనందం, సంతోషాన్ని వ్యక్తం చే శారు. చార్మినార్ అందాలను తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుని తెగ ఎంజాయ్ చేశారు. ప్రపంచ అందగత్తెలు చార్మినార్ ముందు ని ర్వహించిన హెరిటేజ్ వాక్‌తో సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి తెలిపా రు. చార్మినార్ ముందు ఫోటో సెషన్ అనంతరం చార్మినార్ లోపలికి వెళ్లి మిస్ వరల్ కంటెస్టెంట్లు సందర్శించారు. అద్భుత కట్టడాన్ని చూసి మైమరచి పోయారు. చార్మినార్ విశిష్టతను, చారిత్రక నేపథ్యాన్ని వివిధ దేశాల నుంచి వచ్చిన మిస్ వరల్డ్ ప్రతినిధులకు టూరిజం గైడ్లు వివరించారు.

లాడ్ బజార్ షాపింగ్‌తో సందడే సందడి

ఈ సందర్శనలో భాగంగా చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ చుడీ బజార్ అయిన లాడ్ బజార్‌లో కంటెస్టెంట్స్ గాజులు, ముత్యాల హారాలు, ఇతర అలంకరణ వస్తువులను షాపింగ్ చేశారు. వీరి కోసం ఎంపిక చేసిన కొన్ని షాపులను తెరచి ఉంచగా అక్కడ స్వయంగా సుందరాంగులు షాపింగ్ చేయడంతో దుకాణ యజమానులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. స్థానిక హస్తకళల పట్ల అందాల భామలు ఆసక్తిని ప్రదర్శించారు. కొందరు కంటెస్టెంట్స్ గాజుల తయారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించి, నిపుణులైన కారిగర్లు (కళాకారులు), శిల్పులకు తమ ప్రశంసలు తెలిపారు.

చార్మినార్ సమీపంలోని చుడీ బజారు దుకాణాల్లో గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ చేశారు. అయితే లాడ్ బజార్ వ్యాపారుల తమ ఉదారత ప్రదర్శించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల దగ్గర డబ్బులు తీసుకోకుండా వ్యాపారులు నిరాకరించారు. హైదరాబాద్ విశిష్టతను చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా తమ దేశాల్లో చాటాలని కంటెస్టెంట్లను వ్యాపారులు కోరారు. వ్యాపారులు మిస్ వరల్డ్ ప్రతినిధులకు తమ షాపుల్లోకి గులాబీ పూలు ఇచ్చి ఆహ్వానించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శన కేవలం పోటీలలో భాగంగానే కాకుండా, ప్రపంచ శాంతి, సాంస్కృతిక సామరస్యానికి సాక్ష్యంగా నిలిచింది. చార్మినార్ సందర్శన, లాడ్ బజార్ షాపింగ్ అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకున్నారు. దీంతో చార్మినార్ సందర్శన ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News