Wednesday, March 26, 2025

లిక్కర్ కేసుకు మిథున్ రెడ్డికి సంబంధం లేదు : జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఏంటని?… ఆయన తండ్రి ఏ శాఖ మంత్రిగా ఉన్నారా? అని వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సంధర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. మిథున్ రెడ్డికి మద్యానికి సంబంధం ఏమిటని నిలదీశారు. ఎవర్నో ఒకర్ని ఇరికించడం కేసు పెట్టడం సరియైనది కాదని హితువు పలికారు. ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారని మండిపడ్డారు. మద్యం రేట్లు మేం పెంచామా?… మద్యం బేసిక్ రేట్లు పెంచి.. సరఫరా తగ్గంచిన తనకు లంచాలు ఇస్తారా? అని జగన్ బాధను వ్యక్తం చేశారు.

మద్యం రేట్లు పెంచి సరఫరా పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మమూళ్లు ఇస్తారా? అని జగన్ దుయ్యబట్టారు. తన లాగా ఎందుకు చంద్రబాబు బటన్ నొక్కలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తనకు డబ్బుపై వ్యామోహం లేదని, అందుకే డిబిటిలో రెండున్నర లక్షల కోట్లు ఇచ్చామన్నారు. బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలని, ప్రలోభాలకు లొంగో, భయపడో లేక రాజీపడో అటు పోతే విశ్వసనీయత సంగతేంటి? అని జగన్ అడిగారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని, ఐదేళ్లు కష్టపడితే మన టైం వస్తుందని, విశ్వసనీయత ముఖ్యమన్నారు. ఇది మాజీ ఎంపి విజయసాయిరెడ్డికైనా, మిగతావారికైనా వర్తిస్తుందని జగన్ దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News