Tuesday, October 15, 2024

కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి…. ఎంఎల్‌ఎ అరెకపూడి గాంధీ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన శేరిలింగంపల్లి ఎంఎల్‌ఎ అరెకపూడి గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో అరెకపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కౌశిక్‌రెడ్డి సవాల్ నేపథ్యంలో ఆయన ఇంటికి అరెకపూడి గాంధీ వెళ్లారు. కౌశిక్‌రెడ్డి ఇంటి బయట అరికెపూడి గాంధీ తన అనుచరుల ధర్నా చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌశిక్‌రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరులు కోడి గుడ్లు, టమాటాలు విసిరారు. కౌశిక్‌రెడ్డి ఇంట్లో గాంధీ ధర్నాకు దిగారు. కౌశిక్‌రెడ్డికి దమ్ముంటే బయటకు రావాలని, తాను ఇక్కడే ఉన్నానంటూ గాంధీ సవాల్ విసిరారు. వెంటనే పోలీసులు అరెకపూడి గాంధీతో ఆయన అనుచరులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

తెలంగాణలో ఒక ఎంఎల్‌ఎకే రక్షణ లేదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వం ఎలా రక్షణ ఇస్తుందని ప్రశ్నించారు. తనని హత్య చేయడానికే తన ఇంటికి వద్దకు వచ్చారని, రేపు ఉదయం 11 గంటలకు బిఆర్‌ఎస్ పార్టీ తడాఖా చూపిస్తామన్నారు. ఇవాళ అరెకపూడి గాంధీ చేసిన చర్యకు రేపు ప్రతిచర్య ఉంటుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. అరెకపూడి గాంధీ కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చారని, తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డను అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News