Tuesday, October 15, 2024

కౌశిక్‌రెడ్డి ఓ బ్రోకర్: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మ్మెల్యే అరికెపూడి గాంధీ ఫైరయ్యారు. కౌశిక్‌రెడ్డి ఓ బ్రోకర్ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “కౌశిక్ రెడ్డి నాకే సవాల్‌ చేస్తాడా..? నేను బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అని అసెంబ్లీలో స్పీకర్‌ ప్రకటించారు.. అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశాను.. కౌశిక్‌రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. కేసీఆర్‌ మాట్లాడితే సమాధానం చెబుతా” అని అరికెపూడి అన్నారు.

కాగా.. పార్టీ పిరాయించిన పది మంది ఎంఎల్‌ఎలపై వేటు వేయాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. అయితే.. తాను కాంగ్రెస్ లో చేరలేదని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. దీంతో అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్లి బిఆర్‌ఎస్ కండువా కప్పుతానని కౌశిక్ రెడ్డి అన్నారు. ఇద్దరం కలిసి తెలంగాణ భవన్ కు వెళ్లి ప్రెస్ మీట్ కూడా పెడదామని చెప్పారు.  దీంతో అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్లకుండా కౌశిక్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News