Sunday, July 27, 2025

కల్వకుర్తి అభివృద్ధికి సిఎం పెద్దపీట: ఎమ్మెల్యే కసిరెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు మంజూరై పనులను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో శనివారం సుమారు 15 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఏడాదిన్నర కాలంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణంలో పేదలకు ఉపయోగపడే అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అందరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులను అందిస్తున్నామని తెలిపారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక, ఐకేపి, మెప్మా ద్వారా మహిళ సంఘాలకు రుణాలు అందిస్తున్నట్లు నారాయణరెడ్డి వెల్లడించారు.

గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధికి చెంసిందేమి లేదని విమర్శించారు. సుమారు ఏడాదిన్నర కాలంలో విద్య, వైద్యం, ఆరోగ్యం, తాగు, సాగునీటికోసం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేరుస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వావిళ్ల మనీల సంజీవ్‌యాదవ్, నాయకులు బాలాజీసింగ్, భూపతిరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మోత్యనాయక్, సురేందర్‌రెడ్డి, రాములుయాదవ్, రమాకాంత్‌రెడ్డి, బాలునాయక్, చంద్రకాంత్‌రెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News