కెసిఆర్‌కు కలుసుకున్న కవిత
ఉన్నత విద్య కోసం అమెరికా వెళుతున్న
తన కుమారుడికి ఆశీర్వాదం ఇప్పించిన కవిత
నేడు కుమారుడితో కలిసి అమెరికాకు వెళ్లనున్న ఎమ్మెల్సీ
సెప్టెంబర్ 1న తిరిగి హైదరాబాద్‌కు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తన తండ్రి, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌ను కలుసుకున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం నాడు ఎర్రవల్లి నివాసానికి వెళ్లారు. కవిత చిన్న కుమారుడు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అతడికి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇప్పించేందుకు కవిత కుటుంబ సభ్యులతో కలిసి కెసిఆర్ వద్దకు వెళ్లారు. శనివారం ఉదయం తన కుమారుడు ఆర్యతో కలిసి.. కవిత అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. 15 రోజులపాటు కవిత అమెరికాలో ఉండనున్నారు. కవిత తన కుమారుడు ఆర్యను అమెరికాలోని కళాశాలలో గ్రాడ్యుయేషన్‌లో చేర్పించి, సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఇప్పటికే కవిత పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత.. కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. కవిత అమెరికా పర్యటనకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కెసిఆర్‌కు కలుసుకున్న కవిత
- Advertisement -
- Advertisement -
- Advertisement -